For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Maharaja T20 Trophy 2024: విజేతగా మైసూర్ వారియర్స్.. ఫైనల్లో చెలరేగిన కరుణ్ నాయర్!

మహారాజా టీ20 ట్రోఫీ 2024లో మైసూర్ వారియర్స్ విజేతగా నిలిచింది. బెంగళూరు బ్లాస్టర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో కరుణ్ నాయర్ సారథ్యంలోని మైసూర్ వారియర్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. కార్తీక్(44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71), కరుణ్ నాయర్(45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించారు. మనోజ్ భాండేజ్(13 బంతుల్లో 2 ఫోర్లతో 5 సిక్స్‌లతో 44 నాటౌట్) దూకుడుగా ఆడాడు.

Maharaja T20 Trophy 2024 Karun Nair s Mysore Warriors lifts the tittle after beat Bengaluru Blasters in the final

బెంగళూరు వారియర్స్ బౌలర్లలో జ్ఞానేశ్వర్ నవీన్(2/44) రెండు వికెట్లు తీయగా.. క్రాంతి కుమార్(1/23), శుభాంగ్ హెగ్దే(1/42)తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బెంగళూరు బ్లాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఎల్‌ఆర్ చేతన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), క్రాంతి కుమార్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. మైసూర్ వారియర్స్ బౌలర్లలో విద్యాధర్ పాటిల్(3/19) మూడు వికెట్లు తీయగా.. కోదండ అజిత్ కార్తీక్, ధనుష్ గౌడ, కృష్ణప్ప గౌతమ్, దీపక్ దేవడిగా తలో వికెట్ తీసారు.

ఈ టోర్నీలో 12 మ్యాచ్‌ల్లో 560 పరుగులతో మైసూర్ వారియర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ కరుణ్ నాయర్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. విజేతగా నిలిచిన మైసూర్ వారియర్స్ జట్టులో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సుమిత్ ద్రవిడ్ కూడా ఉన్నాడు. అయితే ఫైనల్లో అతనికి చోటు దక్కలేదు.

Story first published: Monday, September 2, 2024, 15:13 [IST]
Other articles published on Sep 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+