Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి భారతరత్న ఇవ్వాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్!

Madhya Pradesh Congress MLA PC Sharma demands Bharat Ratna for MS Dhoni

భోపాల్: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకి దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'ఇవ్వాలని ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడు. మహీ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ఒకింత భావోద్వేగానికి గురైన మధ్య ప్రదేశ్‌కు చెందిన భోపాల్‌ ఎమ్మెల్యే పీసీ శర్మ.. ధోనీ దేశ ఆణిముత్యమని ట్విటర్ వేదికగా కొనియాడాడు. 'క్రికెట్‌లో భారత్‌కు ఎంతో ఖ్యాతి తెచ్చి విజేతగా నిలిపిన ధోనీ దేశ ఆణిముత్యం. అతన్ని దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించాలి'అని హిందీలో ట్వీట్ చేశాడు.

ఇక మహీ భారత క్రికెట్ చేసిన సేవలకుగాను ఇప్పటికే భారత ప్రభుత్వం .. 2007లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న, 2009లో పద్మ శ్రీ, 2018లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. అయితే భారతరత్న పురస్కారాన్ని 1954 నాటి నిబంధనల ప్రకారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి మాత్రేమే ఇచ్చేవారు. అయితే 2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి "మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా" అనే పదాన్ని చేర్చడంతో అన్ని రంగాల వారికి దీన్ని ప్రదానం చేస్తున్నారు. క్రీడల్లో సచిన్‌ టెండూల్కర్‌కు మాత్రమే ఈ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చారు.



ఇక ధోనీ చడిచప్పుడు లేకుండా సింపుల్‌గా ఓ ఇన్‌స్టా పోస్ట్‌తో శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 'కెరీర్‌ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వెంటనే సురేశ్ రైనా కూడా ధోనీ వెంటే నడిచాడు. మహీకి సన్నిహితునిగా ఉన్న రైనా.. వీడ్కోలులోనూ అతడినే అనుసరించాడు.

ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్ది నిమిషాలకే అతను కూడా అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించాడు. 'నీతో కలసి ఆడడం కంటే ఏదీ గొప్ప కాదు. నీతో కలసి ఆడినందుకు నా హృదయం గర్వంతో ఉప్పొంగిపోతున్నది. ఈ జర్నీలో నీతో పాటే నడవాలని అనుకుంటున్నా. భారతావనికి ధన్యవాదాలు.. జైహింద్'అని రైనా రాసుకొచ్చాడు.

Story first published: Monday, August 17, 2020, 14:20 [IST]
Other articles published on Aug 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+