Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా సలహా తర్వాతే గంగూలీ కెరీర్ ఊపందుకుంది: మాజీ కోచ్‌

Madan Lal says Sourav Gangulys Career Blossomed After My Advice For Him To Open In ODIs

కోల్‌కతా: తన సలహా తర్వాతే టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెరీర్ ఊపందుకుందని మాజీ కోచ్‌, 1983 ప్రపంచకప్‌ జట్టు ఆటగాడు మదన్‌ లాల్‌ అన్నాడు. 1996లో తాను కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు యాజమాన్యం గంగూలీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావించిందని, దాంతో తనే వెళ్లి దాదాతో మాట్లాడినట్లు తెలిపాడు. దాదా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను తనే మార్చానని చెప్పాడు.

ఆ స్థానంలో ఆడితే లాభం లేదు

ఆ స్థానంలో ఆడితే లాభం లేదు

మదన్‌ లాల్‌ తాజాగా స్పోర్ట్స్‌కీదాతో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ... '1996లో భారత జట్టు కోచ్‌గా ఉన్నా. జట్టు యాజమాన్యం సౌరవ్ గంగూలీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని భావించింది. దాదాకు గుర్తుందో లేదో తెలియదు కానీ.. నేను వెళ్లి అతనితో ఇలా చెప్పాను. "గంగూలీ నువ్వు ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తే ఏం లాభం లేదు. నేరుగా వెళ్లి ఓపెనింగ్‌ చేయాలి" అని అన్నాను. దాంతో దాదా వెంటనే అంగీకరించాడు. ప్రతీ ఆటగాడికీ తనదైన శైలి ఉంటుంది. అలాగే గంగూలీకి ఒక బ్యాటింగ్‌ స్టైల్‌‌ ఉంది. అన్ని షాట్లూ ఆడగల సామర్థ్యం గలవాడు' అని తెలిపాడు.

గంగూలీ వెనక్కి తిరిగి చూసుకోలేదు

గంగూలీ వెనక్కి తిరిగి చూసుకోలేదు

'ఏ ఆటగాడికైనా క్రీజులోకి వెళ్లాక కుదురుకోడానికి కాస్త సమయం పడుతుందని, అలాంటి పరిస్థితుల్లో చివర్లో వెళ్లి కొన్ని పరుగులు చేస్తే సరిపోదని గంగూలీతో అన్నా. దాంతో దాదా ఒప్పుకున్నాడు. తర్వాత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి భారత జట్టుకు ఓపెనింగ్‌ చేశాడు. అప్పటినుండి గంగూలీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. లిటిల్‌ మాస్టర్‌తో కలిసి చేసిన పరుగులు టీమిండియాకు ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టింది. వారిద్దరూ తమ బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. అద్భుత ఓపెనింగ్ జోడిగా పేరు సాధించారు' అని మాజీ కోచ్‌ చెప్పాడు. నా సలహా తర్వాతే గంగూలీ కెరీర్ ఊపందుకుందని మదన్‌ లాల్‌ అన్నాడు.

ఓపెనర్‌గా మారకముందు 10 వన్డేలే

ఓపెనర్‌గా మారకముందు 10 వన్డేలే

సౌరవ్ గంగూలీ ఓపెనర్‌గా మారకముందు కేవలం 10 వన్డేలే ఆడాడు. 1996లో దక్షిణాఫ్రికాతో జైపూర్‌ వేదికగా ఆడిన వన్డే‌లో ఓపెనింగ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో దాదా అర్ధ శతకం సాధించాడు. దాంతో ఆ స్థానంలో విజయవంతమవ్వడమే కాకుండా లిటిల్ ‌మాస్టర్‌తో కలిసి రికార్డు భాగస్వామ్య పరుగులు 8,227 చేశాడు. వన్డే క్రికెట్‌లో ఏ జోడీకైనా ఇప్పటి వరకూ ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఆపై కెప్టెన్‌గా కూడా విజయవంతమయ్యాడు.

సచిన్ మంచి కెప్టెన్

సచిన్ మంచి కెప్టెన్

సచిన్ టెండూల్కర్ మంచి కెప్టెన్ అని మదన్ లాల్ అన్నాడు. మాస్టర్ గొప్ప సారథి కాదని ఎవరూ అనుకోవద్దన్నాడు. 'సచి​ను గొప్ప కెప్టెన్ కాదంటే నేను అంగీకరించను. కానీ అతడు తన ప్రదర్శన గురించి ఎక్కువగా ఏకాగ్రతగా ఉండాలనుకుంటాడు. జట్టు మొత్తం గురించి పట్టించుకోవడం అతడి కష్టంగా అనిపించి ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్ అంటే అందరి ప్రదర్శన పట్ల జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన 10మందిలోని అత్యుత్తమ ఆటను బయటకు తీయాల్సి ఉంటుంది. అయితే సచిన్ ఆటను, పరిస్థితులను సులువుగా అర్థం చేసుకుంటాడు. ఎలా బంతులు వేయాలో బౌలర్లకు చెబుతాడు. అన్ని విషయాల్లో అతడికి అద్భుతమైన విషయ పరిజ్ఞానం ఉంది. మన వ్యక్తిగత ప్రదర్శనపై ఎక్కువ ఏకాగ్రత్తగా ఉన్నప్పుడు.. కొన్నిసార్లు కెప్టెన్సీ కాస్త కష్టమే. అంత మాత్రాన సచిన్ మంచి కెప్టెన్​ కాదని కాదు' అని పేర్కొన్నాడు.

శ్రీశాంత్‌ ఆడుతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా: సచిన్

Story first published: Friday, June 19, 2020, 18:58 [IST]
Other articles published on Jun 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+