Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ తీసుకున్న ఆ నిర్ణయం సూపర్: మదన్‌ లాల్

Madan Lal says Rohit Sharma not bowling Axar after his expensive over was the highest point of his captaincy

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన పోరులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో విఫలమైనా.. కెప్టెన్‌గా సత్తా చాటాడని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సారథ్యం ఆకట్టుకుందని ప్రశంసించాడు. ఆదివారం ఆఖరి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓటమి ఖాయమనుకున్న దశలో విరాట్ కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో విజయాన్నందించాడు.

తాజాగా ఈ మ్యాచ్‌పై స్పందించిన మదన్‌లాల్ రోహిత్ శర్మ కెప్టెన్సీని కొనియాడాడు. భారీగా పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్‌‌తో కేవలం ఒక్క ఓవర్‌ వేయించడం సరైన నిర్ణయమని మెచ్చుకున్నాడు. అంతేకాకుండా రవిచంద్రన్ అశ్విన్‌ను రెండో స్పిన్నర్‌గా తీసుకోవడంతోపాటు మూడు ఓవర్లు వేయించి మంచి నిర్ణయం తీసుకొన్నాడని పేర్కొన్నాడు.

Madan Lal says Rohit Sharma not bowling Axar after his expensive over was the highest point of his captaincy

'రోహిత్ శర్మ సారథ్యం చాలా బాగుంది. అక్షర్ పటేల్ తన తొలి ఓవర్‌లో భారీగా పరుగులు (21) సమర్పించాడు. దీంతో మరో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చేతికి బంతినిచ్చాడు. అశ్విన్‌ను ఎంచుకోవడం మంచి నిర్ణయం. మూడు ఓవర్లు వేసిన అశ్విన్‌ వికెట్‌ తీయకపోయినా.. పరుగులు భారీగా ఇవ్వలేదు. అందుకే పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీలో ఇదొక మంచి ఎత్తుగడ. లేకపోతే అక్షర్‌ పటేల్ ఆత్మ విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉండేది'అని మదన్‌లాల్‌ చెప్పుకొచ్చాడు.

ఇక మదన్‌లాల్‌ వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా ఏకీ భవించాడు.'జట్టులో అత్యంత గౌరవనీయమైన ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్లేయర్ల మధ్య కమ్యూనికేషన్‌ బాగుంది. అతను ఇప్పుడు టీమ్‌ఇండియా కెప్టెన్‌. ఆటగాళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉంటాడు. అలాగే వారి నుంచి గౌరవం పొందుతాడు'అని సురేశ్‌ రైనా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, October 25, 2022, 18:56 [IST]
Other articles published on Oct 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+