For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక ధోని రీ ఎంట్రీ కష్టమే : మాజీ క్రికెటర్

Madan Lal Says One percent chance of MS Dhoni going to T20 World Cup after losing BCCI contract

న్యూఢిల్లీ : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పునరాగమనం కష్టమేనని మాజీ క్రికెటర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్ ఓటమి అనంతరం దాదాపు ఆరునెలలు ఆటకు దూరంగా ఉన్న ధోనిని 2019-20 సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై మదన్‌లాల్ ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. ఆటకు దూరమైనందునే ధోని కాంట్రాక్టు కోల్పోయాడని తెలిపారు.

'నాకు తెలిసి ధోని అప్ కమింగ్ టీ20 వరల్డ్ కప్ ఆడటం చాలా కష్టం. 99 శాతం అతను పునరాగమనం చేయడు. ఒక్కశాతం మాత్రమే అతనికి చాన్స్ ఉంది. ఇంటర్నేషన్ క్రికెట్ దూరమైన అతను డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడటం లేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతుండటంతో బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోయాడు.'అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు.

ఇటీవల టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌ సైతం ధోనీ విశ్రాంతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ధోనీ ఉండాలనుకుంటే.. అతడి ఫిట్‌నెస్‌ గురించి ఎవరేం చెప్పలేరు. ఆ విషయాన్ని ధోనీ తనకు తాను ప్రశ్నించుకోవాలి. గతేడాది జూలై (వన్డే ప్రపంచకప్) నుంచి ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కావాలని జాతీయ జట్టుకు ఇంత కాలం ఎవరైనా దూరమయ్యారా? ఇప్పుడిదే ప్రశ్న అందరి మదిలో ఉంది' అని గవాస్కర్‌ తెలిపారు. ఇక బీసీసీఐ కాంట్రాక్టుల ప్రకారం ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాడికి రూ. 7 కోట్లు, ఎ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు రూ. 5 కోట్లు, బి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు 3 కోట్లు, సి గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు ఒక కోటి చొప్పున వేతనం లభిస్తుంది.

Story first published: Thursday, January 16, 2020, 16:44 [IST]
Other articles published on Jan 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+