Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025 గెలిచేది ఆ జట్టే.. మాజీ క్రికెటర్ జోస్యం!

ఆసియా కప్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు విజేతగా నిలుస్తుందని మాజీ క్రికెటర్ మదన్ లాల్ జోస్యం చెప్పారు. భారత జట్టు బలంగా ఉండటంతో హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే టీ20ల్లో అనూహ్య ఫలితాలు ఎదురవుతాయన్నారు. భారత్ విజేతగా నిలవాలంటే కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులో ఆడించాలని మదన్ లాల్ సూచించారు.

'భారత్‌కు బలమైన జట్టు ఉండడం వల్ల హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్‌లో అనూహ్యమైనది. దీనికి తోడు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు మెరుగైన ప్రదర్శన చేయగలవు. ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌ ప్రమాదకరంగా కనబడుతోంది. ప్రస్తుతం ఆ జట్టు బాగా ఆడుతోంది. దాంతో ఈ టోర్నీ రసవత్తరంగా సాగనుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఫామ్‌లో లేకున్నా.. ఆత్మ విశ్వాసం లేకుండా కనిపించినా.. ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనివ్వగలవు.

Madan Lal Backs India as Asia Cup Favorites Advocates for Kuldeep s Inclusion

కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలి. ఎందుకంటే అతని బౌలింగ్ శైలి ప్రత్యేకమైనది. టీ20 క్రికెట్‌లో అతన్ని బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టం. కుల్దీప్ యాదవ్ ఆడించే విషయంపై తుది నిర్ణయం పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్‌పై ఆధారపడి ఉంటుంది. దుబాయ్ మైదానాల్లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగడం సరైన కాంబినేషన్.'అని మదన్ లాల్ చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, September 3, 2025, 18:48 [IST]
Other articles published on Sep 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+