
హైదరాబాద్: 'సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా లక్కీ టీమ్' ఈ మాటలన్నది ఎవరో కాదు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్. ఐపీఎల్ 11వ సీజన్‌లో బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. బ్యాట్స్‌మన్‌లు భారీ స్కోర్లు సాధించకపోయినా... బౌలర్లు మాత్రం స్వల్ప లక్ష్యాలను కాపాడుతున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్| సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
దీంతో మొన్న ముంబై... నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాలను సొంతం చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో గురువారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ చేసి సంచనల విజయాన్ని నమోదు చేశారు.
బ్యాటింగ్‌లో బ్యాట్స్‌మన్లు విఫలమైనా... బౌలర్లు మాత్రం బాధ్యతాయుతంగా రాణించడంపై సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ 'బౌలర్లు చాలా అద్భుతంగా పోరాడుతున్నారు. వారి బాధ్యతపై వారికి పూర్తి అవగాహన ఉంది' అని కొనియాడాడు.
'పటిష్ఠమైన బౌలింగ్ లైనప్ కలిగి ఉండటం మా అదృష్టం. స్థానిక ప్రతిభావంతులైన ఆటగాళ్లను కలిగి ఉండటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. రాబోయే రోజుల్లో కొన్ని మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. బ్యాట్స్‌మన్ భారీగా పరుగులు చేయనప్పటికీ, బౌలర్లు బంతితో రాణిస్తున్న తీరు నిజంగా అద్భుతం' అని విలియమ్సన్ పేర్కొన్నాడు.
'స్వల్ప పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం నిజంగా అద్భుతం. పవర్ ప్లేలో మా బౌలర్లు రాణించలేకపోయినప్పటికీ, చివర్లో మెరుపులు మెరిపించారు. ఇక, బ్యాట్‌తో కూడా మరిన్ని పరుగులు చేస్తే బాగుంటుంది. ఇలాంటి పిచ్‌లపై 145 లేదా 155 పరుగులు సరిపోతాయి' అని విలియమ్సన్ తెలిపాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 133 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది.