Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs SRH: రిషభ్ పంత్ చెత్త బ్యాటింగ్.. గోయెంకా అసహనం!(వీడియో)

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తమ 12వ మ్యాచ్‌లోనూ రిషభ్ పంత్ విఫలమయ్యాడు. 6 బంతుల్లో ఫోర్ సాయంతో 7 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఇషాన్ మలింగా బౌలింగ్‌లో అతని స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌కు రిషభ్ పంత్ పెవిలియన్ చేరాడు. రిషభ్ పంత్ ఔటవ్వడం చూసి లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనానికి గురయ్యాడు.'ఇక వీడు మారడు'అనే ఎక్స్‌ప్రెషన్‌తో గ్యాలరీలోని బాల్కానీ నుంచి లోపలికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రిషభ్ పంత్‌ను లక్నో రూ. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పంత్ మాత్రం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వరుసగా 18(17), 4(2), 0(2), 3(9), 63(49), 21(18), 2(6), 2(3), 15(15) ,0(6), 6(7) పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అతని వైఫల్యం లక్నో సూపర్ జెయింట్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే సంజీవ్ గోయెంకా తీవ్ర అసహనానికి గురయ్యాడు.

LSG vs SRH Sanjiv Goenka s frustrated reaction to Rishabh Pant s dismissal goes viral
Photo Credit: screen grab for JioHotstar

రిషభ్ పంత్ విఫలమైనా.. లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌లతో 65), ఎయిడెన్ మార్క్‌రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) దూకుడుగా ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/28) రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), కామిందు మెండీస్(21 బంతుల్లో 3 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి(2/37) రెండు వికెట్లు తీయగా.. విల్ ఓ రూర్కీ, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసారు.

Story first published: Monday, May 19, 2025, 21:16 [IST]
Other articles published on May 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+