Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs RCB: అందుకే జోష్ హజెల్ వుడ్, టీమ్ డేవిడ్ ఆడటం లేదు

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగుతున్నాడు. దాంతో మరోసారి జితేష్ శర్మ తాత్కలిక కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. ఛేజింగ్ రికార్డ్‌ తమకు అనుకూలంగా ఉండటంతోనే బౌలింగ్ ఎంచుకున్నానని జితేష్ శర్మ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. ఛేజింగ్ అంటే మాకు ఇష్టం. రజత్ పటీదార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ గెలిచి టాప్-2లో నిలవాలనుకుంటున్నాం. టాప్-2లో నిలిస్తే టీమ్‌కు అడ్వాంటే ఉంటుంది. టీమ్ డేవిడ్ స్థానంలో లివింగ్ స్టోన్, లుంగి ఎంగిడి ప్లేస్‌లో నువాన్ తుషారా తుది జట్టులోకి వచ్చారు. తదుపరి మ్యాచ్‌కు జోష్ హజెల్ వుడ్ అందుబాటులోకి వస్తాడు.'అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు. జోష్ హజెల్ వుడ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, ఈ మ్యాచ్‌లో ఆడుతాడని వార్తలు వచ్చాయి. కానీ రిస్క్ ఎందుకని ఆర్‌సీబీ అతనికి రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో గాయపడిన టీమ్ డేవిడ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

LSG vs RCB Why Josh Hazlewood and Tim David not playing against LSG
Photo Credit: IPL twitter (X)

ముందుగా బ్యాటింగ్ చేసినా? బౌలింగ్ చేసినా తమకు అభ్యంతరం లేదని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. గత మ్యాచ్‌లో తమ సామర్థ్యాన్ని చూపించామని చెప్పిన రిషభ్ పంత్.. ప్రతీ మ్యాచ్‌ ఓ గుణపాఠమని తెలిపాడు. ఆఖరి బంతి వేసే వరకు 100 శాతం ప్రయత్నిస్తామన్నాడు. తుది జట్టులో మార్పులు చేశామని, బ్రీట్స్‌కే, దిగ్వేష్ రతి జట్టులోకి తిరిగి వచ్చారని చెప్పాడు.

తుది జట్లు:
ఆర్‌సీబీ: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, లియామ్ లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, రొమారియో షెపెర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారా, సుయాశ్ శర్మ.

లక్నో సూపర్ జెయింట్స్:
మాథ్యూ బ్రిట్జ్‌కే, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెటన్, కీపర్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింఘ్, షెహ్‌బాజ్ అహ్మద్, దిగ్వేష్ రతి, ఆవేశ్ ఖాన్, విల్ ఓ రూర్కీ,

Story first published: Tuesday, May 27, 2025, 19:21 [IST]
Other articles published on May 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+