Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs RCB: ష్.. గప్ చుప్! గంభీర్‌కు ఇచ్చి పడేసిన విరాట్ కోహ్లీ!

లక్నో: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(కెప్టెన్) విరాట్ కోహ్లీ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఫీల్డింగ్ సమయంలో అతను చేసే హడావుడి అంతా ఇంత కాదు. క్యాచ్ పట్టినా.. బౌలర్ వికెట్ తీసినా.. ఎగిరి గంతేస్తాడు. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటాడు. మ్యాచ్‌కు హాజరైన అభిమానులను కూడా అదే రీతిలో ఉత్సాహపరుస్తుంటాడు. డ్యాన్స్ చేస్తూ.. తన సైగలతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

ఇక మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే ప్రతీ పనిని కోహ్లీ ప్రత్యేకంగా గమనిస్తాడు. వారి ఓవరాక్షన్‌కు సరైన సమయంలో తనదైన శైలిలో బదులిస్తాడు. గతంలో కోహ్లీ గురించి పెద్దగా తెలియని వెస్టిండీస్ బౌలర్ కెస్రిక్ విలియమ్స్.. ఇలానే తోక జాడిస్తే తనదైన శైలిలో విరాట్ బదులిచ్చాడు. వెస్టిండీస్ పర్యటనలో అతను చేసిన ఓవరాక్షన్‌కు.. భారత్‌లో బదులిచ్చాడు. మైదానంలో ప్రత్యర్థి కవ్వింపు చర్యలను కోహ్లీ బాగా గుర్తుపెట్టుకుంటాడు.

Virat Kohli Gautam Gambhir

ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి కవ్వింపు చర్యలకు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరగడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు లొల్లి లొల్లి చేశారు.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క పరుగుతో గెలవడంతో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ కవ్వింపు చర్యలకు దిగాడు. ఆర్‌సీబీ అభిమానులవైపు చూస్తూ... ష్.. గమ్మునుండాలని సైగ చేశాడు. విజయం మాదని గర్వం ప్రదర్శించాడు. అప్పట్లో ఈ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.

తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆయూష్ బదోని క్యాచ్‌ను అందుకున్న కోహ్లీ.. గంభీర్‌లానే ష్. .గప్‌చుప్ అంటూ ప్రేక్షకుల వైపు చూస్తూ... లక్నో మెంటార్ కవ్వింపులకు బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఇద్దరి ఫొటోలను పక్క పక్కనపెట్టి ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులే చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 44), కెప్టెన్ విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్
మూడు వికెట్లు తీయగా.. రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. కృష్ణప్ప గౌతమ్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Story first published: Monday, May 1, 2023, 23:07 [IST]
Other articles published on May 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+