For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs RCB: కేజీఎఫ్ విఫలమైనా.. శతక్కొట్టిన రజత్ పటీదార్.. లక్నో ముందు భారీ లక్ష్యం!

LSG vs RCB: Rajat Patidars unbeaten century powers Bangalore to 207/4 against Lucknow

కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యువ ప్లేయర్ రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఆర్‌సీబీ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పటీదార్‌కు అండగా దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ పడింది. లక్నో చెత్త ఫీల్డింగ్ ఆర్‌సీబీకి కలిసొచ్చింది. ఆర్‌సీబీ కేజీఎఫ్(కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్) విఫలమైనా.. రజత్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ అభిమానులను ఆకట్టుకుంది.

ఫాఫ్ అట్టర్ ఫ్లాఫ్..

ఫాఫ్ అట్టర్ ఫ్లాఫ్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. మోహ్‌సిన్ ఖాన్ వేసిన తొలి ఓవర్‌లోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్.. కింగ్ కోహ్లీతో కలిసి జట్టును ఆదుకున్నాడు. విరాట్ నిదానంగా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేయగా.. పటీదార్ చెలరేగాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 5వ ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన పటీదార్.. కృనాల్ వేసిన 6వ ఓవర్‌లో 4, 4, 6, 4 వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. దాంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత లక్నో బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో అంతగా బౌండరీలు రాలేదు.

పటీదార్ విధ్వంసం..

పటీదార్ విధ్వంసం..

దాంతో ఒత్తిడికి గురైన విరాట్ కోహ్లీ(25).. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద ఔటయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కృనాల్ వేసిన 11వ ఓవర్‌లో క్విక్ సింగిల్ తీసి 28 బంతుల్లో పటీదార్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ మరుసటి బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గ్లేన్ మ్యాక్స్‌వెల్(9) క్యాచ్ ఔటయ్యాడు. లోమ్రోర్ క్రీజులోకి రాగా.. పటీదార్ చమీరా బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు. అయితే లోమ్రోర్‌ను రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఇదే ఓవర్‌లో కార్తీక్ ఎల్బీగా వెనుదిరిగే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అంపైర్ కాల్స్‌తో బచాయించాడు.

6 బంతుల్లో 5 బౌండరీలు..

6 బంతుల్లో 5 బౌండరీలు..

మోహ్‌సిన్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్‌లో కార్తీక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. రవి బిష్ణోయ్ వేసిన 16వ ఓవర్‌లో పటీదార్ విధ్వంసం సృష్టించాడు. 6, 4, 6, 4, 6 వరుసగా 5 బౌండరీలు బాది 27 పరుగులు పిండుకున్నాడు. అయితే ఈ ఓవర్ మూడో బంతికి పటీదార్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను దీపక్ హుడా నేలపాలు చేశాడు. అది కాస్త బౌండరీగా వెళ్లింది. ఆవేశ్ ఖాన్ వేసిన 17వ ఓవర్‌లో కార్తీక్ మూడు బౌండరీలు బాదాడు. మోహ్‌సిన్ ఖాన్ వేసిన 18వ ఓవర్‌లో సిక్స్ బాదిన రజత్ పటీదార్ 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇదే అతని తొలి సెంచరీ కాగా.. 15 ఏళ్ల చరిత్రలోనే అత్యంత వేగమైనది. ఇక చమీరా వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ 6, 4 బాదగా.. రజత్ సైతం 6, 4 కొట్టాడు. ఆవేశ్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో కార్తీక్ బౌండరీతో 200 పరుగుల మార్క్ ధాటించాడు.

Story first published: Wednesday, May 25, 2022, 22:14 [IST]
Other articles published on May 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+