లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పక్కటెముకల గాయంతో గత మూడు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కే పరిమితమైన ఫాఫ్ డుప్లెసిస్.. ఈ మ్యాచ్‌తో పూర్తి స్థాయి ప్లేయర్‌గా జట్టును నడిపిస్తున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని స్పష్టం చేశాడు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ మరింత టర్న్ అయ్యే అవకాశం ఉందన్నాడు. తాను ఫిట్‌గా ఉన్నానని తెలిపిన డుప్లెసిస్.. జట్టులో మార్పులు చేశామన్నాడు. హజెల్ వుడ్ అందుబాటులోకి వచ్చాడని, బ్యాటింగ్‌ను బలోపేతం చేయడం కోసం షెహ్‌బాజ్ స్థానంలో అనూజ్ రావత్‌ను జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు. ఈ పిచ్ కండిషన్స్‌కు తమ జట్టు సరిగ్గా సరిపోతుందన్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే విజయాన్నందుకోవచ్చని చెప్పాడు.

మరోవైపు ఈ పిచ్‌పై ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. జట్టులో ఏకైక మార్పు చేశామని చెప్పిన రాహుల్.. ఆవేశ్ ఖాన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ తుది జట్టులోకి వచ్చాడన్నాడు. ఇక్కడ ఇప్పటికి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడామని తెలిపిన రాహుల్.. పేస్ కంటే స్పిన్నర్లదే హవా నడుస్తుందన్నాడు.
కీలక సమయంలో ప్రశాంతంగా ఉంటూ.. పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేస్తే ఈ మ్యాచ్‌లో విజయాన్నందుకోవచ్చని తెలిపాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది.
తుది జట్లు:
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగా, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(కీపర్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్.