Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs PBKS: మా ఏకైక లక్ష్యం అదే: శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కొత్త మైదానం.. కొత్త పిచ్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో తనకు నిజంగా తెలియదన్నాడు. ఏది ఏమైనా విజయం సాధించడమే తమ లక్ష్యమని చెప్పాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది కొత్త మైదానం. పిచ్ కూడా కొత్తది. అందుకే ఛేజింగ్ చేయాలనుకుంటున్నాం. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ఆటగాళ్లందరికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పరిస్థితులకు తగ్గట్లు ఆడాలి. విజయం సాధించడమే మా లక్ష్యం. పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు మేం ప్రయత్నిస్తాం. పిచ్ ఎలా స్పందిస్తుందో మాకు తెలియదు. కానీ అందుకు తగ్గట్లు వేగంగా మేం అడ్జస్ట్ అవ్వాలి. లాకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి వచ్చాడు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

LSG vs PBKS IPL 2025 Shreyas Iyer Says Our important goal is to win After Won The Toss
Photo Credit: IPL twitter (X)

టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. మాకు మద్దతు తెలిపేందుకు చాలా మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌కు వచ్చారని చెప్పిన పంత్.. అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పాడు.

తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాన్ష్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ .

Story first published: Tuesday, April 1, 2025, 19:23 [IST]
Other articles published on Apr 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+