ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన జోరును కొనసాగిస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్(3/43) మూడు వికెట్లతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది.
యువ బ్యాటర్లు ఆయుష్ బదోని(33 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 41), అబ్దుల్ సమద్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) తో పాటు నికోలస్ పూరన్(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44)రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/39) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం లక్నో కొంపముంచింది. చివర్లో ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్ మెరుపులతో ఈ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. పిచ్ స్లోగా ఉన్న నేపథ్యంలో ఈ లక్ష్యచేధన ఆసక్తికరంగా మారనుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లోనే డేంజరస్ మిచెల్ మార్ష్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే ఎయిడెన్ మార్క్‌రమ్(28)ను ఫెర్గూసన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. రిషభ్ పంత్(2)ను మ్యాక్స్‌వెల్ ఔట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలోనే లక్నో మూడు కీలక వికెట్లు కోల్పోయి 39 పరుగులే చేసింది. వరుసగా వికెట్లు పడ్డా.. నికోలస్ పూరన్ తనదైన శైలిలో చెలరేగాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
అయితే హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని యుజ్వేంద్ర చాహల్ ఔట్ చేసి. నాలుగో వికెట్‌కు నమోదైన 53 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆయుష్ బదోని ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా.. డేవిడ్ మిల్లర్(19)నిరాశపరిచాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో అబ్దుల్ సమద్ భారీ షాట్లతో వేగంగా ఆడాడు. అయితే అతన్నిఅర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చి పంజాబ్‌ను 171 పరుగులకే పరిమితం చేశాడు. ఆఖరి రెండు ఓవర్లలో లక్నో 15 పరుగులు మాత్రమే చేసింది.