
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై గ్రాస్ ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఈ క్రమంలోనే తమ బౌలింగ్ బలహీనంగా ఉందని భావించిన రోహిత్ శర్మ చేజింగ్‌కు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌తో ఫాబియన్ అలెన్ ముంబై తరఫున తొలి మ్యాచ్ ఆడనున్నాడు. టీమ్ బ్యాటింగ్ డెప్త్ పెంచేందుకే అతన్ని జట్టులోకి తీసుకున్నామని టాస్ సందర్భంగా రోహిత్ శర్మ తెలిపాడు.
'డే గేమ్ కావడంతో ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది మంచి పిచ్. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలిస్తోంది. ఇక్కడ అనుభవం కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో నలుగురి ఫారిన్ ప్లేయర్లతో బరిలోకి దిగుతున్నాం, టైమల్ మిల్స్‌తో పాటు పొలార్డ్, బ్రెవిస్, ఫాబియన్ అలెన్ బరిలోకి దిగుతున్నారు. మా వరుస పరాజయాల గురించి ఆందోళన చెందడం లేదు. ప్రశాంతంగా ఉంటూ తమ ఆటను తాము ఆడాలనుకుంటున్నాం. బేసిక్ క్రికెట్ ఆడటంపైనే దృష్టి సారించాం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇక తమ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని, కృష్ణప్ప గౌతమ్ స్థానంలో మనీశ్ పాండే రీఎంట్రీ ఇచ్చాడని చెప్పాడు. ఆరంభ మ్యాచ్ నుంచి తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుందని, కొత్త జట్టు అయినా ఆటగాళ్లంతా సమష్టి రాణిస్తూ విజయాలందిస్తున్నారని తెలిపాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), మనీశ్ పాండే, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్