Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs MI: రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే త్రో.. బిత్తరపోయిన తెలుగోడు! (వీడియో)

లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్ త్రో తో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌కు ముంబై ఇండియన్స్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు.

రవి బిష్ణోయ్ విసిరిన బంతి వికెట్లను డైరెక్ట్ హిట్ చేయడంతో తిలక్ వర్మ బిత్తరపోయాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 6వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని నవీన్ ఉల్ హక్.. ఫుల్ లెంగ్త్‌లో వేయగా తిలక్ వర్మ ప్యాడ్లను తాకింది. దాంతో లక్నో ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేయగా.. అయోమయానికి గురైన తిలక్ వర్మ బంతిని చూసుకోకుండా పరుగుకు ప్రయత్నించాడు.

LSG vs MI Ravi Bishnoi sensational direct hit to dismiss Tilak Varma in 48 IPL 2024 Match

నాన్‌స్ట్రైకర్ ఇషన్ కిషన్ వద్దనడంతో యూటర్న్ తీసుకున్నాడు. కానీ అప్పటికే బంతిని అందుకున్న రవి బిష్ణోయ్ నేరుగా వికెట్లకు త్రో చేశాడు. దాంతో తిలక్ వర్మ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ మరుసటి బంతికే హార్దిక్ పాండ్యా కూడా గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. నవీన్ ఉల్ హక్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను హార్దిక్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ చేతిలో పడింది. దాంతో ముంబై ఇండియన్స్ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్, బర్త్‌డే భాయ్ రోహిత్ శర్మ(4) తీవ్రంగా నిరాశపరిచాడు. మోహిసిన్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సూర్య భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చినా.. స్టోయినీస్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు.

ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్‌తో పాటు నెహాల్ వధేరా ఉన్నారు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.

Story first published: Tuesday, April 30, 2024, 20:46 [IST]
Other articles published on Apr 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+