Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs MI: మళ్లీ ఓడిన ముంబై ఇండియన్స్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్!

LSG vs MI: Rahul century, LSG bowlers send MI hurtling to eighth consecutive defeat

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా 8వ మ్యాచ్‌లో కూడా రోహిత్ సేనకు చుక్కెదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. మిగిలిన 6 మ్యాచ్‌లకు 6 గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్ చేరలేదు. 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని నమోదు చేయకపోవడం అభిమానులను విస్మయపరుస్తోంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 నాటౌట్) సెంచరీతో చెలరేగగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, కీరన్ పొలార్డ్ రెండు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసారు. రోహిత్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 39), తిలక్ వర్మ(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లు తీయగా.. మోహ్‌సిన్ ఖాన్, జాసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని తలో వికెట్ పడగొట్టారు.

రోహిత్ రాణించినా..

రోహిత్ రాణించినా..

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(8) శుభారంభాన్ని అందించారు. ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఆడినా.. రోహిత్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. కానీ ఏడో ఓవర్‌లో రాహుల్.. రవి బిష్ణోయ్‌ను తీసుకురాగా.. ఇషాన్ కిషన్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు.

ఇషాన్ ఔట్‌తో..

ఇషాన్ ఔట్‌తో..

వికెట్లకు దూరంగా బిష్ణోయ్ వేసిన గూగ్లీని ఇషాన్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రైట్ షూస్ తాకి గాల్లోకి లేచింది. ఫస్ట్ స్లిప్‌గా ఉన్న జాసన్ హోల్డర్ సింపుల్‌గా బంతిని అందుకున్నాడు.

దాంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. కీపర్ షూస్‌కు తాకేముందు బంతి నేలకు తాకిందా? అనే సందేహంతో అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్.. బంతి నేలకు తాకలేదని తేల్చి ఔటిచ్చాడు. దాంతో ఇషాన్ కిషన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

విఫలమైన సూర్య..

విఫలమైన సూర్య..

అనంతరం క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్(3) ఔటవ్వగా.. ఆ కొద్ది సేపటికే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ శర్మ(39) కూడా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(7) కూడా ఔటవ్వడంతో ముంబై 67 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. పొలార్డ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 2 భారీ సిక్సర్లతో విజయంపై ఆశలు రేకెత్తించాడు.

కానీ జాసన్ హోల్డర్ 18వ ఓవర్‌ను నిలకడగా వేయడంతో ఒత్తిడికి గురైన తిలక్.. భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చమీరా వేసిన 19వ ఓవర్‌లో చమీరా 5 పరుగులే ఇవ్వడంతో ముంబై ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్‌లో 6 బంతుల్లో 39 పరుగులు అవసరమవ్వగా.. కృనాల్ మూడు వికెట్లు తీసి లక్నో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Monday, April 25, 2022, 7:15 [IST]
Other articles published on Apr 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+