చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. చెన్నై వికెట్ విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం బాగానే కనబడుతోంది. కానీ మ్యాచ్ జరిగే కొద్ది పిచ్ ఎలా మారుతుందో చెప్పలేం. ముంబైలో మేం చేజ్ చేయాలనుకుంటాం. కానీ ఈ మైదానంలో పెద్ద బౌండరీ ఉంది. కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ ప్రత్యర్థి ముందు ఉంచడం చాలా కీలకం.

కుర్రాళ్లంతా మంచి జోష్‌లో ఉన్నారు. అసాధారణ ప్రదర్శనతో మేం ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాం. మా ప్రయాణంలో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని మెరుగ్గా రాణించాం. ఈ కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌కు అన్ని విధాలుగా సిద్దమయ్యాం. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఒక మార్పు చేశాం. కుమార కార్తీకేయ స్థానంలో హృతిక్ షోకీన్‌ను తీసుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్‌లో తమకు కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయని లక్నోసూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా తెలిపాడు. కానీ ఏ రోజు కూడా తమ పోరాటాన్ని ఆపలేదన్నాడు. 'మా జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సమష్టి ప్రదర్శనతోనే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. ఇది మా జట్టు బలం. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నాం. ఇక మా ప్రణాళికలు, నైపుణ్యాలను అమలు చేయడమే. టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. కానీ గుడ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాం.'అని కృనాల్ పాండ్యా తెలిపాడు.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: ఆయూష్ బదోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్(కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్, మోహ్‌సిన్ ఖాన్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, తిలక్ వర్మ, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాశ్ మధ్వాల్.