Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs MI: అందుకే డికాక్‌‌ను పక్కనపెట్టాం: కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్ బౌలింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది.

ఆరంభంలోనే వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ బ్యాటర్లను ఒత్తిడిలోకి పెట్టడం మా ప్లాన్. తక్కువ లక్ష్యానికి పరిమితం చేసి చేధించాలనుకుంటున్నాం. మా జట్టు సమతూకంగా ఉండేలా చూసుకుంటున్నాం. ప్రతీ ఒక్కరు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌ల్లో మాకు కొన్ని అద్భుతమైన విజయాలు దక్కాయి. తప్పని పరిస్థితుల్లో తుది జట్టులో కొన్ని మార్పులు చేశాం.

LSG vs MI KL Rahul says Quinton de Kock misses out Mayank Yadav is back in 48th IPL 2024 Match

ఈ మ్యాచ్‌కు క్వింటన్ డికాక్ దూరమవ్వగా.. కులకర్ణి, మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చారు. గాయం నుంచి కోలుకున్న మయాంక్ యాదవ్ అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను ఈ మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపగలడు. మయాంక్ రీఎంట్రీ కోసం నేను లక్నో ఫిజియో, మెడికల్ టీమ్‌పై ఒత్తిడి తెచ్చాను. మయాంక్ సైతం రీఎంట్రీ ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. అతనికి గాయమైందనే విషయాన్నే మరిచిపోయాడు.'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేసేవాళ్లమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'మేం కూడా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ స్లో వికెట్‌లా కనిపిస్తుంది. ఎలా ఉంటుందో చూడాలి. ఈ టోర్నీలో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ మాకు చావోరేవో‌లాంటివని తెలుసు.

మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మేం ప్రతీసారి మా తుది జట్టుకు అండగా నిలిచాం. కానీ ఆటగాళ్ల గాయాలే మాకు తీవ్ర నష్టం చేశాయి. కీలక ఆటగాళ్లంతా బాగానే ఉన్నారు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీ. మా ఆటగాళ్లపై మేం నమ్మకం ఉంచాం. లూక్ వుడ్ స్థానంలో కోయిట్జీ రీఎంట్రీ ఇచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

తుది జట్లు:

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టోన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మోహ్‌సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.

Story first published: Tuesday, April 30, 2024, 19:21 [IST]
Other articles published on Apr 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+