Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs MI: నవీన్ ఉల్ హక్‌ను వదలని కోహ్లీ ఫ్యాన్స్.. మైదానంలో రచ్చ రచ్చ! (వీడియో)

చెన్నై: లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్‌ హక్‌కు మరోసారి విరాట్ కోహ్లీ అభిమానుల సెగ తగిలింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ అభిమానులు నవీన్ ఉల్ హక్‌కు తమ నిరసనను తెలియజేశారు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్ చేస్తున్నప్పుడు, బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీ కోహ్లీ అంటూ ఫ్యాన్స్ గట్టిగా అరిచారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో- ఆర్‌సీబీ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ‌తో నవీన్ ఉల్‌ హక్ గొడవ పడిన విషయం తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఈ వాగ్వాదం చివరకు గంభీర్-కోహ్లీ మధ్య గొడవకు దారి తీసింది. ఈ సీజన్‌లోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా ఇది నిలిచిపోయింది.

Naveen Ul Haq

కోహ్లీ పదే పదే పిచ్‌పై పరుగెడుతున్నాడని నవీన్ ఉల్ హక్ అంపైర్లకు ఫిర్యాదు చేయగా.. విరాట్ కోహ్లీ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. పిచ్‌పై పరుగెత్తితే తన షూస్ కింద మట్టి ఉండదా? పిచ్ ఫుట్ మార్క్స్ ఉండవా? అని అంపైర్లకు వివరించాడు. అయితే కోహ్లీ కాలు ఎత్తడంతో నవీన్ ఉల్ హక్‌ను అవమానించాడని, కాలి కింది మట్టితో సమానమని అన్నాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అపార్ధం చేసుకున్నారు. గౌతమ్ గంభీర్ సైతం ఇలానే పొరబడి కోహ్లీతో మాటల యుద్దానికి దిగాడు.

మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా వేదికగా కూడా కోహ్లీ-నవీన్ ఉల్ హక్ మధ్య మాటల యుద్దం నడిచింది. ఆ తర్వాత కోహ్లీ అతన్ని వదిలేయగా.. నవీన్ ఉల్ హక్ మాత్రం గెలుకుతూనే వచ్చాడు. కోహ్లీ విఫలమైన ప్రతీసారి నవీన్ ఉల్ హక్ క్రిప్టిక్ పోస్ట్‌తో ఎగతాళి చేశాడు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన తర్వాత కూడా ఇలానే పోస్ట్ పెట్టాడు.

ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ కోహ్లీ ఫ్యాన్స్ తమ నిరసనను వ్యక్తం చేశారు. నవీన్ ఉల్ హక్‌ను సోషల్ మీడియా వేదికగానే కాకుండా మైదానంలోనూ ఏకిపారేసారు. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్.. ఆర్‌సీబీతో కాళ్ల బేరానికి వచ్చింది. గొడవలు వద్దని.. మీరు ఇచ్చారు.. తీసుకున్నామ్.. వచ్చే సీజన్‌లో కలుద్దామని ట్వీట్ చేసింది.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది.

కామెరూన్ గ్రీన్(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 41), సూర్యకుమార్ యాదవ్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), తిలక్ వర్మ(22 బంతుల్లో 2 సిక్స్‌లతో 26) రాణించగా.. ఇంపాక్ట్ ప్లేయర్ నెహాల్ వధేరా(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్‌కు తోడుగా .. యశ్ థాకూర్ మూడు వికెట్లు, మోహ్‌సిన్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Wednesday, May 24, 2023, 22:37 [IST]
Other articles published on May 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+