Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs KKR: వారెవ్వా వాటే క్యాచ్.. చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!(వీడియో)

కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ క్యాచ్‌కు లక్నో ఇంపాక్ట్ ప్లేయర్ అర్షిన్ కులకర్ణి(9) నిరాశగా పెవిలియన్ చేరాడు.

మిచెల్ స్టార్క్ వేసిన రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని అర్షిన్ కులకర్ణి ఫ్లిక్ షాట్ ఆడాడు. దాంతో బంతి కవర్ డీప్, బ్యాక్‌వార్డ్ పాయింట్ ఫీల్డర్ల మధ్య గాల్లోకి లేచింది. కవర్ డీప్ నుంచి వేగంగా పరుగెత్తుకొచ్చిన రమణ్‌దీప్ సింగ్.. సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు.

Ramandeep Singh Takes Blinder

చాలా దూరం పరుగెత్తి ఈ క్యాచ్ అందుకోవడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ వీడియోను ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. స్టన్నింగ్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత గొప్ప క్యాచ్ అని కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగగా.. ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32), రఘు వంశీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్(3/49) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. కేఎల్ రాహుల్(25), మార్కస్ స్టోయినీస్(36) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు. ఆండ్రీ రస్సెల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, May 5, 2024, 23:17 [IST]
Other articles published on May 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+