For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs KKR: అందుకే మయాంక్ యాదవ్‌ను పక్కనపెట్టాం: కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఛేజింగ్ తమకు కలిసి వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. నేను గొప్ప పిచ్ రీడర్‌ను కాదు. మాకు ఛేజింగ్ కలిసి వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నా. మా జట్టు గొప్ప లక్షణం ఏంటంటే.. పరిస్థితులను త్వరగా అందిపుచ్చుకొని అందుకు తగ్గట్లు ఆడుతుండటం. అలాగే మా జట్టులో కొందరు వ్యక్తిగతంగా అదరగొడుతున్నారు.

LSG vs KKR KL Rahul Reveals The Reason Why Mayank Yadav Not Playing vs Kolkata

చాలా మంది ఈ మధ్య స్ట్రైక్‌రేట్ గురించి మాట్లాడుతున్నారు. గత కొన్నేళ్లుగా టీ20 క్రికెట్‌లో చాలా మార్పు వచ్చింది. గత మ్యాచ్‌లో గాయపడిన మయాంక్ యాదవ్ స్థానంలో యశ్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.'అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. గత మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం మా ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసింది. జట్టులో ప్రతీ ఒక్కరికి నమ్మకం పెరిగింది.

మేం ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌‌తోనే బరిలోకి దిగుతున్నాం. గత మ్యాచ్ జోరునే కొనసాగిస్తామని ఆశిస్తున్నా. వెంకటేశ్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతని ఆటతీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

కేకేఆర్: ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, నికోలస్ పూరణ్, అష్టోన్ టర్నర్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, మోహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్

Story first published: Sunday, May 5, 2024, 19:25 [IST]
Other articles published on May 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+