LSG vs GT: ఈ రోజు మ్యాచ్ గెలిపించేది శంకరన్నే.. పేలుతున్న సెటైర్స్, మీమ్స్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో తమ ఆరంభమ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌పై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. విజయ్ శంకర్‌పై గుజరాత్ మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ఇతర ఆటగాళ్లను కాదని అతనికి తుది జట్టులో అవకాశం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో విజయ్ శంకర్‌కు అవకాశం దక్కింది.
శంకరన్నే గెలిపించేది..
వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను కాదని శంకర్‌కు చాన్స్ ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతేడాది శంకర్ పేలవ ప్రదర్శనను మరిచిపోయారా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా శంకర్‌పై కుళ్లు జోకులు, నవ్వులు పూయించే మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. చేజింగ్‌లో శంకరన్ననే మ్యాచ్‌ను గెలిపిస్తాడని అభిమానులు ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
లార్డ్ శంకర్..
ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు శంకర్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ అభిమానులం కాకున్నా.. విజయ్ శంకర్ కోసమే ఈ మ్యాచ్ చూస్తున్నామని, అతను చెలరేగాలని కోరుకుంటున్నామని సెటైరికల్‌గా కామెంట్ చేస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయినా.. ఆశ్చర్యం లేదన్నాడు. 3డీ ప్లేయర్ అయిన విజయ్ శంకర్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు విజయ్ శంకర్ లార్డ్ ప్లేయరని కామెంట్ చేస్తున్నారు.
దరిద్రం పోయింది..
గత సీజన్‌లో అతని చెత్తాట కారణంగా గెలిచే మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమిపాలైంది. 10-12 పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితిలో కూడా విజయ్ శంకర్ ఏం చేయలేకపోయాడు. దాంతో అతనిపై అభిమానులు తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ్ శంకర్‌ను తీసుకుంటుందా? అని సందేహ పడ్డారు. చెన్నైకి చెందిన ఓనర్స్ కావడం, ఆ రాష్ట్ర ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో మళ్లీ విజయ్ శంకర్‌ను తీసుకుంటారా? అని కంగారు పడ్డారు. కానీ గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుగోలు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.
దీపక్ హుడా హాఫ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్... షమీ ధాటికి 29 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే కెప్టెన్ కేఎల్ రాహుల్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. క్వింటన్ డికాక్(7), లూయిస్, మనీశ్ పాండే(6) దారుణంగా విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా(51 బ్యాటింగ్).. యువ ప్లేయర్ ఆయుష్ బాదోని(13 బ్యాటింగ్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ అరుణ్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications