For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs GT: శు‌భ్ మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే!

LSG vs GT: Shubman Gill Takes The Catch Of The Tournament In IPL 2022

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న తమ ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సూపర్ ఫీల్డింగ్‌ విన్యాసంతో అందర్ని ఆకట్టుకున్నాడు. వెనక్కి పరుగెడుతూ ఫుల్‌డైవ్‌తో అతను పట్టిన క్యాచ్ లీగ్‌లోనే హైలైట్‌గా నిలిచింది. క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. వరుణ్ ఆరోన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో శుభమ్‌న్ సూపర్ క్యాచ్‌కు లక్నో బ్యాట్స్‌మన్ ఎవిన్ లూయిస్ (10) నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఫోర్త్ స్టంప్ దిశగా వరుణ్ ఆరోన్ వేసిన బౌన్సర్‌ను లూయిస్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బంతి ఎడ్జ్ తీసుకొని స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. ఇక ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ 25 యార్డ్స్ వెనక్కి పరుగెత్తి సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. శుభ్‌మన్ ఫీల్డింగ్ విన్యాసానికి మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. నెటిజన్లు అయితే సూపర్ క్యాచ్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్... షమీ ధాటికి 29 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే కెప్టెన్ కేఎల్ రాహుల్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. క్వింటన్ డికాక్(7), లూయిస్, మనీశ్ పాండే(6) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులో దీపక్ హుడా(5 బ్యాటింగ్), ఆయుష్ బాదోని(1 బ్యాటింగ్) పోరాడుతున్నారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ అరుణ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, March 28, 2022, 20:27 [IST]
Other articles published on Mar 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+