Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs GT: అందుకే సాహాను పక్కన పెట్టాం: శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. అంతేగాకుండా గత రెండు మ్యాచ్‌ల్లో మేం ముందుగానే బ్యాటింగ్ చేసి మా లక్ష్యాలను అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నాం. మా పై గుజరాత్ టైటాన్స్‌కు మంచి రికార్డు ఉంది.

LSG vs GT Shubman Gill Reveals The Reason Why Wriddhiman Saha Is Not Playing Against Lucknow

ఆ జట్టుకు అద్భుతమైన కాంబినేషన్ ఉండటంతో గత రెండు సీజన్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. మా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నాం. మా పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్‌కు ఇదే తొలి సీజన్.

గతంలోనే అతను కొన్ని గాయాలకు గురయ్యాడు. 21 ఏళ్లకే చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్‌ను మెయింటేన్ చేయడం చాలా ముఖ్యం. మా జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారు. మోర్నే మోర్కెల్ గైడెన్సీలో వారు మరోలా కనిపిస్తున్నారు.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్‌మన్ గిల్ తెలిపాడు. దాంతో టాస్ ఓడినా సంతోషంగానే ఉందన్నాడు. 'గత మ్యాచ్‌లో మేం 33 ఓవర్ల వరకు ఆధిపత్యం చెలాయించాం. కానీ చివరి 7 ఓవర్లలోనే మ్యాచ్ మలుపు తిరిగింది.

జట్టలో కొన్ని మార్పులు చేశాం. వెన్ను నొప్పితో బాధపడుతున్న వృద్దిమాన్ సాహా ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో బీఆర్ శరత్ అరంగేట్రం చేస్తున్నాడు. ఒమర్జాయ్ స్థానంలో స్పెన్సర్ తిరిగి వచ్చాడు. గత మ్యాచ్ ఫలితం గురించి మేం మరిచిపోయాం.'అని శుభమ్‌న్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, బీఆర్ శరత్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ

Story first published: Sunday, April 7, 2024, 19:33 [IST]
Other articles published on Apr 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+