Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs GT: మిచెల్ మార్ష్ కూతురికి సీరియస్.. అతను ఆడటం లేదు: రిషభ్ పంత్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. అతని కూతురు అనారోగ్యానికి గురవ్వడంతో మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. చూడటానికి పిచ్ బాగుంది. గత రెండు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది. ఓ జట్టుగా మా ప్రక్రియపైనే ఫోకస్ పెట్టాం. ప్రతీ ఆటగాడు అద్భుతంగా ఆడుతున్నాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. మా విజయాల క్రెడిట్ వారిదే. ఈ మ్యాచ్‌కు మిచెల్ మార్ష్ దూరమయ్యాడు. అతని స్థానంలో హిమ్మత్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మిచెల్ మార్ష్ కూతురు అనారోగ్యానికి గురైంది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

LSG vs GT IPL 2025 Rishabh Pant Reveals The Reason Why Mitchell Marsh Not Playing Vs Gujarat Titans
Photo Credit: IPL (X)

ఈ సీజన్‌లో మిచెల్ మార్ష్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే అతను డకౌటయ్యాడు. ఈ సీజన్‌లో మిచెల్ మార్ష్ వరుసగా 72, 52, 0, 60, 81 పరుగులు చేశాడు. అతని గైర్హాజరీ లక్నో‌ సూపర్ జెయింట్స్‌కు నష్టం చేసే అవకాశం ఉంది.

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. 'నేను బౌలింగ్ ఎంచుకోవాలనే అనుకున్నాను. వికెట్‌లో మార్పు ఉంటుందని నేను అనుకోవడం లేదు. ప్రతీ ఒక్కరు రాణిస్తున్నారు. అది మాకు కీలకం. కుల్వంత్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్: ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

Story first published: Saturday, April 12, 2025, 15:27 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+