For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LSG vs GT: కళ్లు చెదిరే క్యాచ్.. బిత్తరపోయిన కేన్ మామ!(వీడియో)

లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

అతని సెన్సేషనల్ రిటర్న్ క్యాచ్‌కు గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బిత్తరపోయాడు. వావ్ వాటే క్యాచ్ అంటూ నిరాశగా పెవిలియన్ చేరాడు.

LSG Vs GT IPL 2024 Ravi Bishnoi takes one handed Stunning Catch to dismiss Kane Williamson

రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని బిష్ణోయ్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. విలియమ్సన్ బౌలర్ పక్క నుంచి పంచ్ షాట్ ఆడాడు. బ్యాట్‌కు మిడిల్ అయిన బంతి రవి బిష్ణోయ్ కుడివైపు గాల్లో లేచింది.

వెంటనే బిష్ణోయ్ అమాంతం గాల్లోకి లేచి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'వారెవ్వా వాటే క్యాచ్.. బిష్ణోయ్ సింగ్ హ్యాండ్ క్యాచ్.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది క్యాచ్'అని కొనియాడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్(43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో పాటు కేఎల్ రాహుల్(31 బంతుల్లో 3 ఫోర్లతో 33), నికోలస్ పూరన్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్), ఆయుష్ బదోని(11 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) రాణించారు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్షన్ నల్కండే రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, April 7, 2024, 22:57 [IST]
Other articles published on Apr 7, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+