Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs GT: లక్నోదే బ్యాటింగ్.. ఓవర్‌సీస్ ప్లేయర్లు ముగ్గురే!

Hardik wins toss, Gujarat Titans opt to bowl in Mumbai

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. ఈ లీగ్‌లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ ప్రత్యర్థులుగా తమ తొలి పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. డ్యూ ప్రభావం ఉండటంతో పాటు స్వేచ్చగా ఆడాలనే ఉద్దేశంతో ఫీల్డింగ్ ఎంచుకున్నానని హార్దిక్ తెలిపాడు. ఈ మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నామని చెప్పాడు. లూకీ ఫెర్గూసన్, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్ తమ ఓవర్ సీస్ ప్లేయర్లని చెప్పాడు.

ఇక వాంఖడేలో ఆడిన ప్రతీసారి ఎవరైనా ముందు బౌలింగ్ చేయాలనుకుంటారని, ఇది సర్వసాధారణమని రాహుల్ చెప్పుకొచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ కీలక పాత్ర పోషిస్తుందనే విషయం అందరికి తెలిసిందేనని, కానీ వికెట్ మాత్రం 40 ఓవర్ల పాటు ఒకే రకంగా ఉంటుందన్నాడు. ఇది తమ ఫస్ట్ గేమ్ అని, ఈ మ్యాచ్‌ను ఆస్వాదించడం తమకు చాలా ముఖ్యమని చెప్పాడు. ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని ఉంచి విజయం కోసం పోరాడుతామని చెప్పాడు. తాము ముగ్గురు ఓవర్‌సీస్ ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఎవిన్ లూయిస్, క్వింటన్ డికాక్, చమీరా బరిలోకి దిగుతున్నారని చెప్పాడు.

తుది జట్లు(అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, మనీశ్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మోహ్సిన్ ఖాన్, ఆయుష్ బాదోని, దుష్మంత్ చమీరా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, అభినవ్ మన్‌హోరా, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లూకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ

Story first published: Monday, March 28, 2022, 19:25 [IST]
Other articles published on Mar 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+