LSG vs GT: ఆదుకున్న దీపక్ హుడా.. అరంగేట్రంలోని అదరగొట్టిన ఆయూష్.. గుజరాత్ ముందు ఫైటింగ్ టార్గెట్!

ముంబై: అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ఆయూష్ బాదోని(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 29/4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును సీనియర్ ప్లేయర్ దీపక్ హుడా(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55)తో కలిసి ఆదుకున్నాడు. దాంతో 100 పరుగుల్లోపే ఆలౌటవుతదని భావించిన లక్నో.. గుజరాత్ ముందు 159 పరుగులు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరు 5వ వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా(13 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా..ఆరోన్ ఫించ్ రెండు, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

రాహుల్ గోల్డెన్ డక్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే కెప్టెన్ కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అనంతరం షమీ మరుసటి ఓవర్‌లో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 2 బౌండరీలతో జోరు కనబర్చిన ఎవిన్ లూయిస్‌ను శుభమన్ గిల్ స్టన్నింగ్స్ క్యాచ్ సాయంతో వరుణ్ అరుణ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య బ్యాటింగ్‌కు వచ్చిన మనీశ్ పాండేను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీయడంతో లక్నో 29 పరుగులకే కీలక 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆదుకున్న దీపక్ హుడా..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. యువ ప్లేయర్ ఆయుష్ బాదానితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. వరుణ్ అరోన్ వేసిన 13వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ బాదిన దీపక్ హుడా.. రషీద్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు క్విక్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీపక్ హాఫ్ సెంచరీ అనంతరం ఆయుష్ బాదోని హిట్టింగ్ మొదలుపెట్టాడు.

చెలరేగిన ఆయూష్..
హార్దిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్‌లో వరుసగా 6,4,4తో హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. దీపక్ హుడా కూడా ఓ బౌండరీ కొట్టడంతో ఈ ఓవర్‌లో 19 రన్స్ వచ్చాయి. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బాదోని ఓ సిక్స్ కొట్టగా.. దీపక్ హుడా ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో 5వ వికెట్‌కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన కృనాల్ సైతం బౌండరీలతో విరుచుకు పడటంతో లక్నో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన ఆయుష్ అరంగేట్ర మ్యాచ్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి ఓవర్‌లో అతను ఔటవ్వడంతో లక్నో 158/7 పరుగులకు పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications