4
లక్నో: ఘోర రోడ్డు ప్రమాదంతో ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు ఆ జట్టు అరుదైన గౌరవం కల్పించింది. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు కోరిక మేరకు డగౌట్‌లో రిషభ్ పంత్ జెర్సీని ఉంచింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని మళ్లీ మైదానంలో తిరిగిరావాలని తమ చర్యలతో చెప్పకనే చెప్పింది. రిషభ్ పంత్ కోసం జట్టు మొత్తం ఎదురు చూస్తోందని యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేసింది.
ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ఆటగాళ్ల క్యాప్‌లపై రిషభ్ పంత్ జెర్సీ నెంబర్ 17ను ముద్రించి గౌరవం తెలపింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఆరంభ మ్యాచ్‌లో డగౌట్ పై కప్పుపై రిషభ్ పంత్ పేరిట ఉన్న జెర్సీ నెంబర్ 17ను ఉంచింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. పంత్‌ను చాలా మిస్సవ్వనున్నామని తెలిపాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతని సందడి లేదంటేనే జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పాడు.

వీలైతే పంత్‌ను డగౌట్‌లో తన పక్కన కూర్చోపెట్టుకుంటానని తెలిపాడు. మొకాలి శస్త్రచికిత్సతో ఇంటికి పరిమితమైన పంత్.. మ్యాచ్‌కు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో జెర్సీ నెంబర్‌ను డగౌట్‌లో ఉంచి అతనిపై ఉన్న ప్రేమను ఢిల్లీ క్యాపిటల్స్ చాటుకుంది. దాంతో రికీ పాంటింగ్ అన్నంత పనిచేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. టైటిల్ గెలిచి పంత్‌కు గిఫ్టిగా ఇవ్వాలని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను కోరుతున్నారు.
రిషభ్ పంత్ గైర్హాజరీలో తాత్కలిక సారథిగా డేవిడ్ వార్నర్ జట్టును నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌కు దిగింది. కేఎల్ రాహుల్(8) విఫలమైనా.. కైల్ మేయర్స్(72 బ్యాటింగ్) విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నో 11 ఓవర్లలోనే 2 వికెట్లకు 98 పరుగులు చేసింది.