Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs DC: ఐదేసిన మార్క్‌వుడ్.. చేతులెత్తేసిన ఢిల్లీ! భారీ విజయంతో లక్నో షురూ!

లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ శుభారంభం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మార్క్ వుడ్ (5/14) చెలరేగడంతో లక్నో 50 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది.

కైల్ మేయర్స్(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), ఆయూష్ బదోని(18) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

LSG vs DC: Mark Wood 5 wicket haul helps Lucknow big win against Delhi

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో9 వికెట్లకు 143 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. డేవిడ్ వార్నర్(48 బంతుల్లో 7 ఫోర్లతో 56), రిలీ రోసౌ(20 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30)టాప్ స్కోరర్లుగా నిలిచారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్(5/14) ఐదు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

దెబ్బతీసిన మార్క్ వుడ్..
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌లు ధాటిగా ప్రారంభించారు. వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో 4 ఓవర్లలోనే ఢిల్లీ 40 పరుగులు చేసింది. అయితే 5వ ఓవర్‌ వేసిన మార్క్‌వుడ్.. వరుస బంతుల్లో పృథ్వీ షా(12), డేంజరస్ మిచెల్ మార్ష్(0)ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు.

గంటకు 147 కిలోమీటర్లతో మార్క్ వుడ్ వేసిన బంతులకు పృథ్వీ షా, మిచెల్ మార్ష్ క్రీజులో నిలబడలేకపోయారు. ఇద్దరూ క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరారు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్లకు 47 పరుగులు చేసింది. ఆ వెంటనే సర్ఫరాజ్ ఖాన్ సైతం వినూత్న షాట్ ఆడబోయి క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

డేవిడ్ వార్నర్ పోరాడినా..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిలీ రోసౌ‌తో డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు. రోసౌను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన రోవ్‌మన్ పోవెల్(1) కూడా ఎల్బీగా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు.

మరోవైపు డేవిడ్ వార్నర్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు దిగిన అమన్ హకీమ్ ఖాన్(4) దారుణంగా విఫలమయ్యాడు. చేయాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో ఒత్తిడికి గురైన బ్యాటర్లు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరారు. డేవిడ్ వార్నర్ సైతం ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టబోయే క్యాచ్ ఔటయ్యాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఆచితూచి ఆడుతూ రన్‌రేట్ మెరుగుపరిచే ప్రయత్నం చేయగా.. మార్క్‌వుమ్ మరోసారి దెబ్బకొట్టాడు. ఆఖరి ఓవర్‌లో అక్షర్ పటేల్‌, చేతన్ సకారియాను క్యాచ్ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

Story first published: Saturday, April 1, 2023, 23:33 [IST]
Other articles published on Apr 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+