Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs DC: ఢిల్లీ కొంపముంచిన సకారియా.. భారీ స్కోర్ చేసిన లక్నో!

లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ కైల్ మేయర్స్(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 7 సిక్స్‌లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), ఆయూష్ బదోని(18) మెరుపులు మెరిపించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. పవర్ ప్లేలో 30 పరుగులు మాత్రమే చేసిన లక్నో.. కైల్ మేయర్స్ విధ్వంసంతో భారీ స్కోర్ అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

చేతన్ సకారియా వేసిన ఆఖరి ఓవర్‌లో ఆయూష్ బదోని వరుసగా రెండు సిక్స్‌లు బాదగా.. కృష్ణప్ప గౌతమ్ ఓ సిక్స్ కొట్టాడు. సకారియా కూడా మూడు వైడ్లు వేయడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తీవ్ర నష్టం చేసింది.

LSG vs DC: Kyle Mayers leads carnage as Lucknow smash 193/6 in 20 overs

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. చేతన్ సకారియా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే కెప్టెన్ కేఎల్ రాహుల్(8).. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి దీపక్ హుడా రాగా.. పవర్ ప్లేలో లక్నో వికెట్ నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం కైల్ మేయర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది 28 బంతుల్లోనే కైల్ మేయర్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చిన అతను సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ కుల్దీప్ యాదవ్..11వ ఓవర్‌లో దీపక్ హుడా(17) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి రెండో వికెట్‌కు నమోదైన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

అక్షర్ పటేల్ వేసిన మరుసటి ఓవర్‌లోనే కైల్ మేయర్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో లక్నో జోరుకు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినీస్(12) కూడా విఫలమయ్యాడు. చివర్లో నికోలస్ పూరన్(17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో36) ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. ఖలీల్ అహ్మద్ బ్రేకులు వేసాడు.

క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోని.. 19వ ఓవర్‌లో ఓ బౌండరీతో పాటు ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది ఔటవ్వగా.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి కృష్ణప్ప గౌతమ్ భారీ సిక్స్ కొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. కృనాల్ పాండ్యా(15 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

Story first published: Saturday, April 1, 2023, 21:32 [IST]
Other articles published on Apr 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+