LSG vs DC: టర్నింగ్ పాయింట్ అదే.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. బుధవారం లక్నో వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. బౌలింగ్‌లో లుంగి ఎంగిడ(3/27), నటరాజన్(3/29) తీన్మార్ బౌలింగ్‌తో సత్తా చాటితే.. బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39) అసాధారణ ప్రదర్శనతో విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35), అబ్దుల్ సమద్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడితో పాటు నటరాజన్ మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టాప్-4 బ్యాటర్లు కేఎల్ రాహుల్(0), పాతుమ్ నిస్సంక(1), నితీష్ రాణా(15), అక్షర్ పటేల్(0) విఫలమైనా.. ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 119 పరుగులు జోడించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మోహ్‌సిన్ నఖ్వీ తలో వికెట్ తీసారు.
టర్నింగ్ పాయింట్..
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. బౌలింగ్‌లో ఆ జట్టుకు మెరుగైన ఆరంభం లభించినప్పటికీ.. ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నారు.ఈ జోడీని విడదీయడంలో విఫలమైన లక్నో బౌలర్లు మూల్యం చెల్లించుకున్నారు. 4.3 ఓవర్లలో 26/4 స్కోర్‌తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును స్టబ్స్-రిజ్వీ గట్టెక్కించారు.
ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రిజ్వీ.. ఔటాఫ్ సిలబస్‌లా బ్యాటింగ్ చేశాడు. అతని బ్యాటింగ్‌కు ఫిదా అయిన స్టబ్స్ ఆచితూచి ఆడి రిజ్వీకి స్ట్రైక్ ఇచ్చాడు. దూకుడైన బ్యాటింగ్‌తో 33 బంతుల్లోనే ఈ జోడీ 51 పరుగులు జోడించి మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చింది. దాంతో లక్నోబౌలర్లు తేలిపోయారు. మొత్తానికి ఈ జోడీ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఢిల్లీని గెలిపించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications