LSG vs CSK: చెలరేగిన ఊతప్ప, శివమ్ దూబే.. లక్నో ముందు భారీ లక్ష్యం!

ముంబై: కోల్‌కతాతో ఫస్ట్ మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) బ్యాటర్లు.. లక్నో సూపర్ జెయింట్స్‌తో దుమ్మురేపారు. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో లక్నో ముందు చెన్నై 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 50) మెరుపు హాఫ్ సెంచరీకి శివమ్ దూబే(30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 49)క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది.
మొయిన్ అలీ(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), అంబటి రాయుడు(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) విలువైన పరుగులు చేయగా.. చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ(6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 16) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

దంచికొట్టిన ఊతప్ప...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(1).. రవి బిష్ణోయ్ సూపర్ ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన ఊతప్ప.. వికెట్ కోల్పోయినా అదే జోరును కొనసాగించాడు. అగ్నికి ఆయువు తోడైనట్లు అతనికి మొయిన్ అలీ తోడయ్యాడు. భారీ సిక్సర్‌తో ఈ సీజన్‌ను ప్రారంభించాడు. ఇక ఆండ్రూ టై వేసిన ఐదో ఓవర్‌లో ఊతప్ప నాలుగు ఫోర్లు బాదగా.. కృనాల్ వేసిన 6వ ఓవర్‌లో మొయిన్ అలీ వరుసగా 4, 6, 4 కొట్టాడు. దాంతో సీఎస్‌కే పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.

మొయిన్ అలీ సైతం..
రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి క్విక్ డబుల్ తీసిన ఊతప్ప హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా రివ్యూ ద్వారా రాహుల్ ఫలితం రాబట్టాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే మొయిన్ అలీని ఆవేశ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, అంబటి రాయుడు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదారు.

ధోనీ మెరుపులు..
ఇక రాయుడి(27)ని బిష్ణోయ్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన జడేజాతో దూబే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని ఆవేశ్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే భారీ సిక్సర్ బాదిన ధోనీ.. మరో ఫోర్‌తో జట్టు స్కోర్‌ను 200కు చేర్చాడు. చివరి ఓవర్లో ఫోర్ బాదిన జడేజా(17).. ఆ వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ప్రిటోరియస్ కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. చివర్లో ధోనీ బౌండరీ ఇన్నింగ్స్ ఫినిష్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications