లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరణుడు ఖతా తెరిచాడు. విజయవంతంగా ఓ మ్యాచ్‌ను మింగేసాడు. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌కు పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసింది.
పిచ్ చాలా నెమ్మదిగా ఉండటంతో బ్యాటింగ్‌కు కష్టమైంది. చెన్నై బౌలర్లు చెలరేగడంతో 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో ఆయూష్ బదోని(33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. నికోలస్ పూరన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించాడు. దాంతో వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ, మహీశ్ తీక్షణ, మతీష పతీరణ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.
వర్షం ఎంతకూ బ్రేక్ ఇవ్వకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేసి ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. సాధ్యమైతే ఐదు ఓవర్ల ఆట ఆడించేందుకు సిద్దమైనా వరణుడు కరుణించలేదు. వర్షం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నష్టపోయింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై.. 130 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించేది.
ఈ మ్యాచ్ ఫలితం తేలకుంగా ముగియడం ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయనుంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు ఐదేసి విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో మూడు, నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే చివరి నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.