Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎక్స్‌ట్రాలే కాదు.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసాడు!

లక్నో సూపర్ జెయింట్స్ యువ స్పిన్నర్ దిగ్వేష్ రతి సంచలన రికార్డ్ నమోదు చేశాడు. 5 బంతుల్లో 5 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో వివాదాస్పద నోట్‌బుక్ సెలెబ్రేషన్స్‌తో తరుచూ వార్తల్లో నిలిచిన దిగ్వేష్ రతి.. తాజాగా ఓ లోకల్ టీ20 లీగ్‌లో వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసాడు. ఇందులో నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కాగా.. మరో బ్యాటర్ మాత్రం వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది? ఏ టోర్నీది అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. కానీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా మాత్రం తన పోస్ట్‌లో స్థానిక టీ20 లీగ్ అని పేర్కొన్నారు. దీంతో ఇది ఏదో ఒక టీ20 లీగ్‌లో జరిగిందనే విషయం అర్థమవుతోంది.

LSG Spinner Digvesh Rathi Takes 5 Wickets In 5 Balls During Local T20 League Match

ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ రతి 3.5 ఓవర్లు బౌలింగ్ చేసి 28 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. అప్పటికే మూడు ఓవర్లు బౌలింగ్ వేసిన రతి.. తన ఆఖరి ఓవర్‌లో అరుదైన ఫీట్ సాధించాడు. మిస్టరీ గూగ్లీలతో బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో దిగ్వేష్ రతి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 13 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసాడు. అయితే వికెట్ తీసిన అనంతరం నోట్‌బుక్ సెలెబ్రెషన్స్‌తో అతిగా ప్రవర్తించి రెండు సార్లు జరిమానాకు గురయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగడంతో ఓ మ్యాచ్‌ నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు.

Story first published: Tuesday, June 17, 2025, 9:52 [IST]
Other articles published on Jun 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+