Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG Playing XI vs RR: డికాక్ కోసం బిగ్ హిట్టర్‌పై వేటు! రాజస్థాన్‌తో ఆడే లక్నో టీమ్ ఇదే!

జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. బుధవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు విజయాలతో జోరు కనబర్చిన లక్నోకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. దాంతో రాజస్థాన్‌పై విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని లక్నో టీమ్ భావిస్తోంది.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. అంతేకాకుండా సొంతమైదానంలో ఈ మ్యాచ్ ఆడనుండటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. దాంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. అభిమానులకు కావాల్సిన మజా అందనుంది.

Quinton de Kock re-entry, Kyle Mayers set to be benched

ఈ మ్యాచ్‌లో లక్నోసూపర్ జెయింట్స్ తుది జట్టులో మార్పులు చేయనుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన కైల్ మేయర్స్‌పై వేలు వేయనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో మేయర్స్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టిన సౌతాఫ్రికా స్టార్ క్వింటన్ డికాక్‌ను ఆడించాలని లక్నో భావిస్తోంది.

వాస్తవానికి డికాక్ రెగ్యూలర్ ఓపెనర్ అయినప్పటికీ అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరమవడంతో కైల్ మేయర్స్‌ను ఆడించారు. ఆరంభ మ్యాచ్‌ల్లో అతను విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో డికాక్ అందుబాటులోకి వచ్చినా మేయర్స్‌నే కొనసాగించారు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో అతను విఫలమవడంతో డికాక్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు.

కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేయనుండగా.. దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్‌లు మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. మార్కస్ స్టోయినీస్ పర్వాలేదనిపించినా.. దీపక్ హుడా ఇప్పటి వరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. అతని భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.

Quinton de Kock re-entry, Kyle Mayers set to be benched

కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయూష్ బదోని ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. కృనాల్ బౌలింగ్‌లోసత్తా చాటుతున్నా బ్యాటింగ్‌లో రాణించిందేం లేదు. పూరన్ మాత్రం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బదోని విలువైన పరుగులు చేస్తున్నాడు. మార్క్‌వుడ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. ఆవేశ్ ఖాన్, యుధ్‌వీర్ చరక్ అతనితో పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జట్టులో కొనసాగనున్నాడు.

రాజస్థాన్‌తో లక్నో తుది జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయూష్ బదోని, ఆవేశ్ ఖాన్, యుధ్‌వీర్ సింగ్ చరక్, మార్క్‌వుడ్, రవి బిష్ణోయ్

Story first published: Tuesday, April 18, 2023, 19:00 [IST]
Other articles published on Apr 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+