కోహ్లీ చెప్పిన చిట్కాను అతనిపైనే ప్రయోగించా: ప్రిన్స్ యాదవ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పిన చిట్కాను అతనిపైనే ప్రయోగించి క్లీన్ బౌల్డ్ చేశానని లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ప్రిన్స్ యాదవ్ తెలిపాడు. బంతి ఒక నిర్దిష్ట లెంగ్త్‌లో స్వింగ్ అవుతున్నంత సేపు అదే లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని విరాట్ కోహ్లీ సూచించాడని, ఆ సలహాను పాటించి అతన్నే ఔట్ చేశానని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ డీఎల్‌ఎస్ పద్దతిన 9 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 140.4 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఔట్ స్వింగర్‌ను అంచనా వేయడంలో విఫలమైన విరాట్ కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అవడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి. కోహ్లీ వికెట్ దక్కడంతో ప్రిన్స్ యాదవ్ సంతోషంతో ఎగిరిగంతేసాడు.

'ఈ సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన గత మ్యాచ్ అనంతరం కోహ్లీ భయ్యాతో నేను మాట్లాడాను. బంతి ఒక నిర్దిష్ట లెంగ్త్‌లో స్వింగ్ అవుతున్నంతసేపు అదే లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలని సలహా ఇచ్చాడు. ఇప్పుడు తెలివిగా ఆ సలహాను పాటించి కోహ్లీని ఔౌట్ చేశాను.'అని మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్ తెలిపాడు.
తనను ఔట్ చేసిన ప్రిన్స్ యాదవ్‌ను కోహ్లీ ప్రత్యేకంగా అభినందించాడు. కోహ్లీతో పాటు దేవదత్ పడిక్కల్, జాకబ్ బెతెల్‌ను కూడా ఔట్ చేసిన ప్రిన్స్ యాదవ్.. లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో లక్నో డీఎల్‌ఎస్ పద్దతిన 9 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన ప్రిన్స్ యాదవ్ 16 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications