LPL 2022: తీవ్రంగా గాయపడిన పాకిస్థాన్ క్రికెటర్.. ఆసుపత్రికి తరలింపు!

కొలంబో: శ్రీలంక స్టార్ క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో పళ్లు రాళగొట్టుకునే ఘటన మరవకముందే లంక ప్రీమియర్ లీగ్‌లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ యువ వికెట్ కీపర్ ఆజామ్ ఖాన్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. వికెట్ల వెనుక నిర్లక్ష్యంగా ఉన్న ఆజామ్ ఖాన్ తలకు బంతి బలంగా తాకింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ కుమారుడు ఆజామ్ ఖాన్ గాయపడిన వార్త తెలుసుకొని ఆ జట్టు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
క్యాండీ ఫాల్కన్స్, గల్లే గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాండీ ఫాల్కన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆజామ్ ఖాన్..వికెట్ల వెనుకాల బంతిని అందుకునే క్రమంలో గాయపడ్డాడు. గల్లే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా.. ప్రదీప్ నువాన్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్లో మూడో బంతిని నువాన్ బాగా స్లోగా వేయగా.. అది వైడ్‌గా వెళ్లింది.. బ్యాట్స్ మన్ ని దాటిన తర్వాత సింగిల్ బౌన్స్ అయ్యి నేరుగా అజాం ఖాన్ ముఖం మీదకు దూసుకెళ్లింది. అయితే బంతిని అంచానా వేయడంలో అజాం ఖాన్ విఫలమవ్వడంతో.. నేరుగా బంతి అతని తలకు తాకింది. అజాం ఖాన్ నేలపై పడుకుని విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడిని పరిశీలించాడు. స్ట్రెక్చర్ పై బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మైదానం నుంచి అజాం ఖాన్ ను నేరుగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించిన తర్వాత అతనికి అంతా బాగానే ఉందని తెలిపారు. అజాం ఖాన్ బాగానే ఉన్నాడని.. భయపడాల్సిన అవసరం లేదంటూ గల్లే గ్లాడియేటర్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. అజాం ఖాన్ తండ్రి మొయీన్ ఖాన్ గల్లే గ్లాడియేటర్స్ హెడ్ కోచ్ కూడా. మైదానంలోనే తన కుమారుడుని చూసి ఏం పర్వాలేదంటూ నవ్వుతూ ఆస్పత్రికి పంపాడు. 24 ఏళ్ల అజాం ఖాన్ 2021లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేశాడు. నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. హై క్యాచ్ పట్టే క్రమంలో కరుణరత్నే మూతి పళ్లు రాళగొట్టుకొని ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications