స్టెయిన్.. నువ్వు చేప పిల్లవైతే.. నేను మత్సకారుడిని.. నా వలలో నలిపేస్తా.. పాక్ క్రికెటర్ వార్నింగ్!

కొలంబో: లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) ఫస్ట్ సీజన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఇతర లీగ్‌ల తరహాలోనే అభిమానులకు కావాల్సిన మాజానందిస్తుంది. ఐదు జట్ల మధ్య జరుగుతున్న ఈ లీగ్ సమరంలో ఐపీఎల్ తరహాలో విదేశీ ఆటగాళ్లు భాగస్వామ్యం కావడంతో క్వాలీటీ ఆఫ్ క్రికెట్‌కు డోకా లేకుండా పోయింది. తాజాగా గాలే గ్లాడియేటర్స్, కాండీ టస్కర్స్ మధ్య జరిగిన 19వ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసినా.. ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణ చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ క్రికెటర్ ఆజామ్ ఖాన్, సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ మధ్య నడిచిన ఈ జోక్స్ వార్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. వీరి సంభాషణ స్టంప్స్ మైక్‌లో రికార్డవ్వడంతో వారి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఇంతకీ విషయం ఏంటంటే..?
శ్రీలంక క్రికెట్ నిబంధనల మేరకు ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకున్న డేల్ స్టేయిన్.. జఫ్నా స్టాల్లియన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ లంక టీ20 లీగ్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో (2/33) ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశాడు. అయితే వికెట్ తీసిన ప్రతిసారి చేప తరహాలో సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
స్టెయిన్ సెలెబ్రేషన్స్ టీజ్ చేస్తూ..
దాంతో గురువారం గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్ ఆజామ్ ఖాన్..స్టెయిన్‌ను టీజ్ చేశాడు. స్టెయిన్ బ్యాటింగ్ చేస్తుండగా అతని ఫిషింగ్ సెలెబ్రేషన్స్ ఉద్దేశించి ఆటపట్టించాడు. ‘స్టెయిన్ మీకు తెలుసు.. నేను మత్స్యకారుడిని. మీలాంటి చేపలను పట్టేస్తా'అని హెచ్చరించగా.. ‘ఓ రియల్లీ'అని అంతే వ్యంగ్యంగా స్టెయిన్ బదులిచ్చాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డు అవ్వడంతో నెట్టింట వైరల్ అయ్యాయి.

గ్లాడియేటర్స్ గెలుపు..
ఇక ఈ మ్యాచ్‌లో గ్లాడియేటర్స్ 9 వికెట్లతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండి టస్కర్స్ 19.1 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్( 68) మినహా అంతా విఫలయ్యారు. అనంతరం గ్లాడియేటర్స్ 17 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 130 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. దనుష్క గుణతిలక(94 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో స్టెయిన్ 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications