Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2108: ఈ సీజన్‌లో ముంబై ఖాతాలో ఓ చెత్త రికార్డు

Mumbai

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అద్భుత బౌలింగ్‌‌కు ఈ సీజన్‌లో తొలి పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పటిష్ట బౌలింగ్‌ ముందు తడబడింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబై ఇండియన్స్‌కి 119 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై మొదటి ఆరు ఓవర్లలో(పవర్‌ ప్లే) మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది.

దాంతో ఈ సీజన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. ఈ సీజన్‌లో చెన్నై నమోదు చేసిన 27 పరుగుల అత్యల్ప పవర్‌ ప్లే స్కోరును ముంబై సవరించినట్లయ్యింది. గత ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అత్యల్ప పవర్‌ ప్లే స్కోరును నమోదు చేసింది.

ఆ మ్యాచ్‌లో చెన్నై తొలుత బ్యాటింగ్‌ చేసే క్రమంలో అత‍్యల్ప పవర్‌ ప్లే స‍్కోరుకు పరిమితం కాగా, ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ ఛేజింగ్‌ చేస్తూ అత‍్యల్ప పవర్‌ ప్లే స‍్కోరును నమోదు చేయడం విశేషం. మరొవైపు మొత్తంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది నాలుగో అత్యల్ప పవర్‌ ప్లే స్కోరు కావడం గమనార్హం.

Story first published: Tuesday, April 24, 2018, 23:41 [IST]
Other articles published on Apr 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+