Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్లకు నువ్విచ్చిన పంచ్ నాకెంతో నచ్చింది: కోహ్లీకి రిచర్డ్స్ ప్రశంస

Loved the way you gave it back to Australians: Vivian Richards praises Virat Kohli

హైదరాబాద్: తొలి టెస్టు ఆరంభానికి ముందు మాజీ క్రికెట్ లెజెండ్ సర్ వివ్ రిచర్డ్స్‌ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ టీవీ కోసం ఇంటర్య్వూ చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ-వివ్ రిచర్డ్స్ మధ్య చోటు చేసుకున్న సంభాషణను ఇంటర్య్వూ పార్ట్-2 అంటూ బీసీసీఐ శుక్రవారం తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఈ వీడియాలో విరాట్ కోహ్లీ తన వైవాహిక జీవితంతో పాటు ఆస్ట్రేలియాలో 2014-15 పర్యటనలో అద్భుత ప్రదర్శన చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కోహ్లీ మాట్లాడుతూ "2014లో ఇంగ్లాండ్‌ వెళ్లాను. అక్కడ అంతకుముందు విఫల పర్యటనలు చూసిన అనుభవం ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాను" అని చెప్పాడు.

విజువలైజేషన్‌ నాకు సాయం చేసింది

విజువలైజేషన్‌ నాకు సాయం చేసింది

"నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ హోరాహోరీగా సాగింది. అయితే, విజువలైజేషన్‌ నాకు సాయం చేసింది. ఆస్ట్రేలియాకు వెళ్లడానికి మూడు నెలల ముందు నుంచి అక్కడి బౌలర్లను చీల్చి చెండాడినట్లు విజువలైజ్‌ చేసుకున్నాను. దీంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాను" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

రిచర్డ్స్ మాట్లాడుతూ

అనంతరం వివ్ రిచర్డ్స్ మాట్లాడుతూ "నాకు తెలిసి ఆ పర్యటనలో నువ్వు నాలుగు సెంచరీలు చేశావ్. అదే సమయంలో బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా నేను ఆస్ట్రేలియాలోనే ఉన్నాను. ఆ సమయంలో ఆస్ట్రేలియన్లు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్లపై చులకన భావంతో ఉండేవారు. నీ గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన సమయంలో నువ్వు సరిగ్గా బదులిచ్చావు. కేవలం తిరిగివ్వమే కాదు.. చాలా ఆసక్తితో తిరిగిచ్చావు" అని కోహ్లీని కొనియాడాడు.

భార్య అనుష్క శర్మపై

భార్య అనుష్క శర్మపై

అదే సమయంలో బాలీవుడ్ నటి, తన భార్య అనుష్క శర్మను విరాట్ కోహ్లీ నడిపించే దేవతగా అభివర్ణించాడు. రిచర్డ్స్ మాట్లాడుతూ "కొందరు తమకిష్టమైన వ్యక్తితో గడపడాన్ని ఆనందిస్తారు. జీవిత కాలమంతా ఆ ప్రేమను ఆస్వాదిస్తారు. కొందరు అంత ప్రేమ చూపించలేరు. చూస్తుంటే నువ్వు ఈ రెండూ అనుభవిస్తున్నావని అనిపిస్తోంది?" అని అన్నాడు.

PKL 2019: రైడ్‌కు వెళ్లాడంటే పాయింట్ తేవాల్సిందే!

అనుష్క సైతం ఒక ప్రొఫెషనల్‌

అనుష్క సైతం ఒక ప్రొఫెషనల్‌

ఇందుకు బదులుగా కోహ్లీ "క్రికెట్‌తో పాటు నా జీవితానికి దొరికిన అతిపెద్ద ఆశీర్వాదం ఆమె. సరైన వ్యక్తి భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. అనుష్క సైతం ఒక ప్రొఫెషనల్‌ కావడంతో పూర్తిగా నన్ను అర్థం చేసుకుంటుంది. సరైన దారిలో నన్ను నడిపిస్తోంది" అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

Story first published: Friday, August 23, 2019, 18:36 [IST]
Other articles published on Aug 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+