యాషెస్: ఎరుపు మయం కానున్న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్: ఎందుకో తెలుసా?

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా బుధవారం నుంచి లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లకు చెందిన ఆటగాళ్లు ఎర్ర టోపీలతో బరిలోకి దిగనున్నారు. రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కోసం విరాళాలు సేకరించే పనిలో భాగంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ పని చేస్తున్నారు.
ఆటగాళ్ల ధరించే టీ షర్ట్‌లపై కూడా ఎరుపు రంగు నెంబర్లే కనిపించనున్నాయి. ఇక, ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ధరించే ఎరుపు రంగు క్యాప్‌లపై రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ లోగో ఉంటుంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ ఈ ఫౌండేషన్‌ని స్థాపించారు. డిసెంబర్ 2018లో ఊపిరితిత్తుల కేన్సర్‌తో ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ మరణించారు.

ఆండ్రూ స్ట్రాస్ భార్య పేరిట ఫౌండేషన్
ఆమె పేరిట ఆండ్రూ స్ట్రాస్ ఈ ఫౌండేషన్‌ని స్థాపించారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన డబ్బును లంగ్ క్యాన్సర్ బాధితుల వైద్యం కోసం ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాక.. మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారికి లంగ్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించనున్నారు.

ప్రేక్షకులను సైతం ఎరుపు రంగు దుస్తుల్లో
మ్యాచ్‌కి విచ్చేసే ప్రేక్షకులను సైతం ఎరుపు రంగు దుస్తుల్లో రావాల్సిందిగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నిర్వాహకులు తెలిపారు. దీంతో లార్డ్స్ మైదానం మొత్తం ఎరుపు రంగులోకి మారిపోనుంది. అయితే, విరాళాలు సేకరించేందుకు ఆటగాళ్లు వేరే రంగు జెర్సీలతో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కాదు.
లార్డ్స్‌లో యాషెస్ రెండో టెస్టు: ఇరు జట్ల నమోదైన గణాంకాలివే!

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో
ఈ ఏడాది మొదట్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లెన్ మెగ్‌గ్రాత్ ఫౌండేషన్ కోసం కోహ్లీసేన పింక్ టోఫీలను ధరించిన సంగతి తెలిసిందే. కాగా, ఆసీస్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 251 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో రెండో టెస్ట్‌ను ఇంగ్లాండ్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
'రెండో టెస్టులో వార్నర్ చెలరేగుతాడు.. కళ్లలో ఆ కసి కనిపించింది'

లార్డ్స్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:
టిమ్ పైన్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, పీటర్ సిడ్డిల్, నాథన్ లయాన్, జోష్ హెజెల్‌ఉడ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications