క్రీడా బిల్లుకు గ్రీన్ సిగ్నల్!
జాతీయ క్రీడా పరిపాలన బిల్లు (ఎన్‌ఎస్‌జీబీ)కు మోక్షం లభించింది. బిహార్ ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాల నిరసనల మధ్యే సోమవారం క్రీడా బిల్లును లోక్‌సభ ఆమోదించింది. స్వాతంత్య్రం తర్వాత భారత క్రీడా రంగంలో తీసుకొచ్చిన అతి పెద్ద సంస్కరణ ఈ బిల్లు అని కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవ్య తెలిపారు. అలాగే జాతీయ డోపింగ్ నిరోధక (ఎన్‌ఏడీ) సవరణ బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల కారణంగా తొలుత వాయిదా పడిన లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కాగానే క్రీడా బిల్లుకు ఆమోదం లభించింది.
'స్వాతంత్య్రం వచ్చాక క్రీడల్లో ఇదే అతి పెద్ద సంస్కరణ. క్రీడా సమాఖ్యల్లో జవాబుదారీతనం, అథ్లెట్లకు న్యాయం చేకూర్చడంతో పాటు ఉత్తమ పరిపాలనను ఈ బిల్లు అందిస్తుంది. 2036 ఒలింపిక్స్‌కు బిడ్ దాఖలు చేయాలనే లక్ష్యానికి ఈ బిల్లు ఉపయోగకరంగా ఉంటుంది. భారత క్రీడా వ్యవస్థలో ఈ బిల్లుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంత కీలకమైన బిల్లు, సంస్కరణలో ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకపోవడం దురదృష్టకరం'అని మాండవ్య తెలిపారు.

బిల్లులోని ముఖ్యాంశాలు..
- సివిల్ కోర్టు అధికారాలతో నేషనల్ స్పోర్ట్స్ ట్రైబ్యునల్ (ఎన్‌ఎస్‌టీ) ఏర్పాటు చేస్తారు. ఈ ట్రెబ్యునల్ ఆదేశాలను సుప్రీం కోర్టులో మాత్రమే సవాలు చేయడానికి వీలుంటుంది. కింది కోర్టుల జోక్యం ఉండదు.
- నేషనల్ స్పోర్ట్స్ బోర్డు (ఎన్‌ఎస్‌బీ) ఏర్పాటు కానుంది. జాతీయ సమాఖ్యలకు గుర్తింపు ఇవ్వడం, రద్దు చేసే విషయాల్లో ఎన్‌ఎసీబీకి విశేషాధికారాలు ఉంటాయి. క్రీడాకారుల సంక్షేమం కోసం అంతర్జాతీయ సమాఖ్యలతో కలిసి ఎన్‌ఎస్‌బీ కలిసి పనిచేయవచ్చు.
- ఎన్‌ఎస్‌బీ గుర్తింపు పొందిన క్రీడా సమాఖ్యలకు మాత్రమే ప్రభుత్వం నుంచి నిధులు లభిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా ఎన్‌ఎస్‌బీ పరిధిలోకి వస్తుంది.
- నేషనల్ స్పోర్ట్స్ ఎలక్షన్ ప్యానెల్ ఏర్పాటు కానుంది.
- బీసీసీఐ మినహా గుర్తింపు పొందిన అన్ని క్రీడా సమాఖ్యలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రానున్నాయి.
- ఐఓసీతో నిరంతర చర్చలు
- క్రీడా పాలకుల వయసు, పదవీకాలాన్ని కూడా బిల్లులో పొందుపరిచారు. అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారి గరిష్టంగా 12 ఏళ్ల వరకు వరుసగా మూడు పర్యాయాలు పదవుల్లో కొనసాగవచ్చు. క్రీడా పాలకుల వయసును 70 నుంచి 75 ఏళ్లకు పొడిగించారు. ఇందుకు అంతర్జాతీయ సమాఖ్య నియామవళి అనుమతి లభించాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications