వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్,యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ)2024లో తమదైన షాట్లతో ప్రేక్షకులను అలరించారు. అలనాటి ఆటగాళ్లతో ఐపీఎల్ తరహాలో జరుగుతున్న ఈ టోర్నీలో గుజరాత్ గ్రేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఇద్దరూ దిగ్గజాలు కోనార్క్ సూర్యాస్ ఓడిశా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ప్రస్తుతం ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కోనార్క్ సూర్యాస్ ఓడిశా సారథి ఇర్ఫాన్ పఠాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు పేసర్ వినయ్ కుమార్ శుభారంభం అందించాడు. గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వ్యాన్(2)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన గేల్, ధావన్ తమ హిట్టింగ్‌తో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

గేల్ తనదైన శైలిలో భారీ సిక్సర్లు బాదగా.. ధావన్ క్లాస్ షాట్స్‌తో బౌండరీలు రాబట్టాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. గేల్ రెండు బౌండరీలతో పాటు మూడు భారీ సిక్స్‌లు బాది 34 పరుగులు చేయగా.. ధావన్ 23 పరుగులు చేసి కేవన్ కూపర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో కేవన్ కూపర్ హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన కేవన్ కూపర్.. వరుసగా గేల్, మహమ్మద్ కైఫ్, యశ్‌పాల్ సింగ్‌లను పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ అందుకున్నాడు. మొత్తం(4/25) నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో గుజరాత్ గ్రేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది.