For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LLC 2022: పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. వరల్డ్ జెయింట్స్‌పై ఇండియా మహరాజస్ ఘన విజయం

LLC 2022: Srivastava, Yusuf Pathan fifties drive INM to comfortable six-wicket win over WGS

కోల్‌కతా: లెజెండ్స్‌ లీగ్‌ టీ20 టోర్నీలో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన చారిటీ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ సారథ్యంలోని ఇండియా మహరాజాస్‌ గెలుపొందింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఇండియా 6 వికెట్ల తేడాతో వరల్డ్‌ జెయింట్స్‌ను ఓడించింది. బౌలింగ్‌లో పంకజ్ సింగ్ చెలరేగగా.. బ్యాటింగ్‌లో పఠాన్ బ్రదర్స్ అదరగొట్టారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో కోల్‌కతా మైదానం దద్దరిల్లిపోయింది. వివిధ రకాల లేజర్ లైట్లతో పాటు అభిమానులు మొబైల్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్‌లో రెహమాన్ పాడిన 'వందేమాతరం'ను ప్లే చేశారు. దీన్ని చూసి ప్రేక్షకులు పరవశించిపోయారు.

పంకజ్ సింగ్ పాంచ్ పటాకా..

పంకజ్ సింగ్ పాంచ్ పటాకా..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రైన్(31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ రామ్‌దిన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) ధాటిగా ఆడాడు.

ఇండియా మహరాజస్ బౌలర్లలో పంకజ్ సింగ్(5/26) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహహ్మద్ కైఫ్ తలో వికెట్ తీసారు. శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 19వ ఓవర్‌లో రామ్‌దిన్ ఐదు బౌండరీలతో 22 పరుగులు పిండుకున్నాడు.

దుమ్మురేపిన పఠాన్ బ్రదర్స్...

దుమ్మురేపిన పఠాన్ బ్రదర్స్...

అనంతరం ఇండియా మహరాజస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టిమ్‌ బ్రెస్నన్‌ (3/21) ధాటికి ఇండియా 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సెహ్వాగ్‌ (4), పార్థివ్‌ పటేల్ (18), మహమ్మద్ కైఫ్‌ (11) దారుణంగా విఫలమయ్యారు.

అయితే తన్మయ్‌ శ్రీవాస్తవ (39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 54), యూసుఫ్‌ పఠాన్‌ ( 35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్‌), ఇర్ఫాన్‌ పఠాన్‌ ( 9 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్‌) చెలరేగారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో టిమ్ బ్రెస్నన్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వార్డ్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుల్లో..

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ల్లో భాగంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ జట్టుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరిగినా.. అతను వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. దాంతో హర్భజన్ సింగ్ టీమ్‌ను నడిపిస్తున్నాడు. ఈ చారిటీ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులను దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్‌కు చెందిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్‌కు అందజేయనున్నారు.

మహిళా అంపైర్లతో..

మహిళా అంపైర్లతో..

2003లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రారంభించిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్.. దేశంలోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా పేద పిల్లలను స్కూళ్లకు పంపించడంలో ఖుషి ఫౌండేషన్ సక్సెస్ అయ్యింది. గత 17 ఏళ్లలో సుమారు 15 లక్షల పిల్లల జీవితాలను మార్చింది. మహిళల సాధికారత కోసం ఈ మ్యాచ్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళా అంపైర్లు అంపైరింగ్ చేస్తున్నారు. మ్యాచ్ రిఫరీతో పాటు అంపైర్లు, టీవీ అంపైర్లు కూడా మహిళలే కావడం విశేషం. భారత్‌లో ఓ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు మహిళా అంపైర్లు ఉండటం ఇదే తొలిసారి. లీగ్ మొత్తం మహిళలే అంపైరింగ్ చేయనున్నారు.

Story first published: Saturday, September 17, 2022, 7:46 [IST]
Other articles published on Sep 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+