For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LLC 2022: చెంపదెబ్బ ఘటన తర్వాత కలిసి ఆడిన హర్భజన్, శ్రీశాంత్!

LLC 2022: Harbhajan Singh and Sreesanth finally play together during Legends League Cricket

కోల్‌కతా: లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 సీజన్‌తో టీమిండియా దిగ్గజ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ ఒక్కటయ్యారు. మాములుగా ఈ ఇద్దరి పేర్లు చెప్పగానే అందరికి చెంపదెబ్బ ఘటనే గుర్తుకొస్తుంది. ఐపీఎల్(2008) అరంగేట్ర సీజన్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా సహనం కోల్పోయిన హర్భజన్ సింగ్.. శ్రీశాంత్‌పై చేయి చేసుకున్నాడు.

అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పినప్పటికీ తీవ్ర నేరంగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు ఆ సీజన్ ఆడకుండా భజ్జీపై నిషేధం విధించాడు. భజ్జీ కొట్టినందుకే తాను ఏం బాధపడలేదని కూడా శ్రీశాంత్ పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. కానీ ఆ ఘటన నుంచి ఈ ఇద్దరూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో..

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించడంతో అతను ఆటకు దూరమయ్యాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీం కోర్టులో పోరాడి నిషేధాన్ని ఎత్తేయించుకున్నాడు. మళ్లీ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ఫ్రాంచైజీలు అతన్ని పట్టించుకోలేదు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో బరిలోకి దిగాడు.

ఈ టోర్నీ ఆరంభ వేడుకల్లో భాగంగా వరల్డ్ జెయింట్స్, ఇండియా మహరాజస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో శ్రీశాంత్ రీఎంట్రీ ఇచ్చాడు. హర్భజన్ సింగ్ సారథ్యంలో ఇండియా మహరాజస్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

మరోసారి దెబ్బలు తప్పవ్ అనుకున్నామ్..

మరోసారి దెబ్బలు తప్పవ్ అనుకున్నామ్..

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో వీరిద్దరూ కలిసి జట్టు గెలుపుకోసం ఆడారు. వారిద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ కలిసి మ్యాచ్ ఆడి జట్టును గెలిపించడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో బౌలర్‌గా శ్రీశాంత్ దారుణంగా విఫలమయ్యాడు. శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు.

ముఖ్యంగా అతను వేసిన 19వ ఓవర్‌లో రామ్‌దిన్ ఐదు బౌండరీలతో 22 పరుగులు పిండుకున్నాడు. దాంతో మరోసారి శ్రీశాంత్‌పై భజ్జీ చేయిచేసుకుంటాడా? అని ఎదురు చూసామని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు.

చెలరేగిన పంకజ్ సింగ్

చెలరేగిన పంకజ్ సింగ్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రైన్(31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ రామ్‌దిన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఇండియా మహరాజస్ బౌలర్లలో పంకజ్ సింగ్(5/26) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహహ్మద్ కైఫ్ తలో వికెట్ తీసారు.

చెలరేగిన యూసఫ్ పఠాన్

చెలరేగిన యూసఫ్ పఠాన్

అనంతరం ఇండియా మహరాజస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టిమ్‌ బ్రెస్నన్‌ (3/21) ధాటికి ఇండియా 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సెహ్వాగ్‌ (4), పార్థివ్‌ పటేల్ (18), మహమ్మద్ కైఫ్‌ (11) దారుణంగా విఫలమయ్యారు.

అయితే తన్మయ్‌ శ్రీవాస్తవ (39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 54), యూసుఫ్‌ పఠాన్‌ ( 35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్‌), ఇర్ఫాన్‌ పఠాన్‌ ( 9 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్‌) చెలరేగారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో టిమ్ బ్రెస్నన్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వార్డ్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, September 17, 2022, 11:18 [IST]
Other articles published on Sep 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+