Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌లో తుపాకుల మధ్య ఆడాం.. భారత్‌లో ఆడలేమా?: బంగ్లాదేశ్ కెప్టెన్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ బహిష్కరించడం పూర్తిగా బోర్డు పెద్దల నిర్ణయమేనని బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిటన్ దాస్ స్పష్టం చేశాడు. ఇందులో ఆటగాళ్ల పాత్ర ఏ మాత్రం లేదని చెప్పాడు. అధికారులను ఎంత కన్విన్స్ చేసినా వినలేదని తెలిపాడు.

భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026ను బంగ్లాదేశ్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. భద్రతాపరమైన కారణాలను సాకుగా చూపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మొండి పట్టును వీడలేదు. పాక్ క్రికెట్ బోర్డును చూసుకొని భారత్‌తో కయ్యానికి దిగింది.

తుపాకుల మధ్య ఆడాం..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్వవహారంపై స్పందించిన లిటన్ దాస్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. భారత్‌లో భద్రత లేదని చెప్పడం సరైన కారణం కాదని అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్‌లో తాము తుపాకుల మధ్య మ్యాచ్‌లు ఆడిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు.

Litton Das Slams Government Over Controversial T20 World Cup Boycott Says If We Can Play In Pakistan Why Not India

'బోర్డు పెద్దలు మాకు భారత్‌లో భద్రత లేదని చెప్పారు. అప్పుడు మేం వారితో మేమంతా పాకిస్థాన్‌లో తుపాకుల మధ్య ఆడాం కదా? ఇంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఇంకేముంటాయి. పాకిస్థాన్‌లో ఆడినప్పుడు భారత్‌లో ఎందుకు ఆడలేం? అని అధికారులను మేం నిలదీసాం.’అని లిటన్ దాస్ చెప్పుకొచ్చాడు.

ఆటగాళ్లను పట్టించుకోలేదు..

అయితే ఇదే వ్యవహారంపై లిటన్ దాస్ గతంలో భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'మేం ప్రపంచకప్ ఆడుతామని మీరు అనుకుంటున్నారా? నాకు, నా జట్టుకు క్లారిటీ లేదు. నేనైతే సమాధానం చెప్పను. మీరు ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. దానికి సమాధానం చెప్పడం నాకు సురక్షితం కాదు’అని అన్నాడు.

ఆటగాళ్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ ఆడకూడదని నిర్ణయించుకున్నాయని ఆ దేశ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అప్పట్లో మీడియాకు తెలిపారు. తాజాగా ఈ వాదనను లిటన్ దాస్ తోసిపుచ్చాడు. ఇది ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం కాదన్నాడు. ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని వాపోయాడు.

ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై వేటుతో..

ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతీకార చర్యకు దిగింది. తమ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. ఇదే అవకాశంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును రెచ్చగొట్టింది. చివరకు ఐసీసీ అంగీకరించకపోవడంతో టోర్నీ నుంచి తప్పుకుంది. దాంతో ఐసీసీ.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌కు ప్రపంచకప్ ఆడే అవకాశం కల్పించింది.

Story first published: Tuesday, June 9, 2026, 19:25 [IST]
Other articles published on Jun 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+