Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: బంగ్లాదేశ్ కెప్టెన్

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఛేజింగ్ టీమ్స్ ఎక్కువగా విజయాలు సాధించాయని, దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ టోర్నీ తొలి దశలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు సాధించాయి. అంతేకాకుండా ఈ పిచ్ ఎలా ఉంటుందో మాకు ఖచ్చితంగా తెలియదు. ఈ మ్యాచ్ ఆడటానికి మేం ఉత్సాహంగా ఉన్నాం. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. సోహన్, రిషాద్ ఆడటం లేదు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. ఇది ఇప్పటికే ఉపయోగించిన పిచ్ అని, ముందుగా బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. 2021 నుంచి చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని, పరిణతి చెందుతున్నారని తెలిపాడు. తాము ఎలాంటి మార్పులు చేయలేదని, విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.

Litton Das Explains His Decision to Bowl First vs Sri Lanka Based on Pitch Conditions and Tournament Trend

తుది జట్లు:

శ్రీలంక :
పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమీల్ మిశారా, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమీందు మెండిస్, వనిందు హసరంగ, దునిత్ వెల్లాలగే, దుష్మంత చమీర, నువాన్ తుషార.

బంగ్లాదేశ్ :
సైఫ్ హసన్, తంజీద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్/కెప్టెన్), తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, జాకర్ అలీ, మహేది హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తఫిజుర్ రహమాన్.

Story first published: Saturday, September 20, 2025, 19:54 [IST]
Other articles published on Sep 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+