Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final:టీమిండియా ఓటమికి అసలు కారణం అదే..చూస్తూచూస్తూనే పెద్ద తప్పిదం చేసిన విరాట్ కోహ్లీ!

List Of Reasons For India Losing WTC Final 2021

హైదరాబాద్: కనీసం డ్రా కచ్చితమనుకున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరులో భారత్‌కు అనూహ్య పరాజయం. న్యూజిలాండ్‌ కఠిన పేస్‌ సవాల్‌ ముందు టీమిండియా చతికిలపడింది. పలుమార్లు వర్షం, వెలుతురులేమి కారణంగా రిజర్వ్‌డే అయిన ఆరో రోజు వరకు సాగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ సత్తాచాటింది. తొలిసారి ఐసీసీ నిర్వహించిన టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గదను దక్కించుకుంది. అయితే ఫైనల్లో భారత్ ఓటమికి అసలు కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయాలేనని సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 ఇద్దరు స్పిన్నర్లతో భారత్

ఇద్దరు స్పిన్నర్లతో భారత్

జూన్ 18 నుంచి 23 వరకు టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ జరిగింది. మ్యాచ్ ప్రారంభం కావ‌డానికి ఒక‌రోజు ముందే భారత్ టీమ్‌ను ప్ర‌క‌టించింది. అయితే తొలి రోజు వ‌ర్షం కార‌ణంగా టాస్ కూడా ప‌డ‌లేదు. వ‌ర్షం వ‌ల్ల అక్క‌డి ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాంతో ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజాలలో ఒకరిని తప్పించి.. పేస్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ లేదా మహ్మద్ సిరాజ్‌ని తుది జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది.

టాస్ వేసే ముందు వ‌ర‌కూ తుది జ‌ట్టులో మార్పులు చేసే అవ‌కాశం ఉంటుంది. అయినా కూడా ముందుగా ప్ర‌క‌టించిన జట్టుతోనే కోహ్లీసేన బ‌రిలోకి దిగింది. ఇద్దరు స్పిన్నర్లతో భారత్ తుది జట్టుని ఎంపిక చేయడం పెద్ద పొరపాటని అప్పుడే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అదే నిజమైంది కూడా. మ్యాచ్ జరిగేకొద్దీ నాలుగో పేసర్ లేని లోటు భారత్ జట్టులో స్పష్టంగా కనబడింది.

ఐదుగురు పేసర్లతో కివీస్

ఐదుగురు పేసర్లతో కివీస్

న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్‌ పటేల్‌ని పక్కనపెట్టి ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగి సౌథాంప్టన్ వాతావరణ పరిస్థితుల్ని బాగా వినియోగించుకుంది. ఐదుగురిలో కొలిన్ గ్రాండ్‌హోమ్ మినహా.. మిగిలిన నలుగురు (టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, కైల్ జెమీషన్, నీల్ వాగ్నర్) మంచి సమన్వయంతో వికెట్లు పడగొట్టారు. భారత్ నుంచి మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ తప్ప ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. చివరి రోజు ఎండ రావడంతో అశ్విన్‌కి కూడా క్రమంగా కష్టమైపోయింది. జడేజా కూడా పూర్తిగా విఫలమయ్యాడు. అటు బ్యాట్, ఇటు బాల్‌తో తేలిపోయాడు. ఇక బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

అభిమానులకు భారీ షాక్.. ఇకపై మందు, చిందులు లేవు!!

కోహ్లీ పెద్ద తప్పిదం చేశాడు

కోహ్లీ పెద్ద తప్పిదం చేశాడు

ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్‌లను పక్కనపెట్టి భారత్ జట్టు మూల్యం చెల్లించుకుందని విమర్శలు వస్తున్నాయి. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్‌ను కూడా ఈ టూర్‌కి ఎంపిక చేయకపోవడాన్ని పెద్ద తప్పిదంగా చెపుతున్నారు. ఫాన్స్ అయితే విరాట్ కోహ్లీపై మండిపడుతున్నారు. 'వర్షం పడుతున్నా.. చూస్తూచూస్తూనే విరాట్ కోహ్లీ పెద్ద తప్పిదం చేశాడు' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఐసీసీ టోర్నీలు కోహ్లీకే అచ్చిరావు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. మొత్తానికి మ్యాచ్ ఓటమికి కోహ్లీ నిర్ణయాలే కారణం అని దుమ్మెత్తిపోస్తున్నారు.

బెస్ట్ టీమ్‌తోనే బ‌రిలోకి దిగాం

బెస్ట్ టీమ్‌తోనే బ‌రిలోకి దిగాం

చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఓటమి త‌ర్వాత తుది జ‌ట్టు ఎంపిక‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డిఫెండ్ చేసుకున్నాడు. బెస్ట్ కాంబినేష‌న్‌తోనే బ‌రిలోకి దిగామ‌ని చెప్పాడు. 'అందుబాటులో ఉన్న బెస్ట్ టీమ్‌తోనే బ‌రిలోకి దిగాం. ఈ కాంబినేష‌న్‌తోనే వివిధ కండిష‌న్ల‌లో మేము విజ‌యం సాధించాం. ఇదే బెస్ట్ కాంబినేష‌న్ అని భావించాం. టెయిలెండ‌ర్ల వ‌ర‌కూ బ్యాటింగ్ ఉంది. అయితే గేమ్‌లో మ‌రింత స‌మ‌యం ఉండి ఉంటే..స్పిన్న‌ర్లు ప్ర‌భావం చూపించేవారు' అని కోహ్లీ చెప్పాడు.

Story first published: Thursday, June 24, 2021, 9:58 [IST]
Other articles published on Jun 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+